బాహుబలి సినిమా తర్వాత.. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే… అతని ఫాన్స్ కు పండగ వచ్చినట్లే. పాన్ ఇండియా సినిమాలతో ఏకైక.. ప్రూవెన్ పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ దుమ్మురేపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 8 సినిమాలు ఉండగా.. ఈ సినిమాలన్నీ రాబోయే మూడు నాలుగేళ్లలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక ఈ ఏడాది ప్రభాస్ నుంచి ఖచ్చితంగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండు సినిమాలు ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాలు కాగా… ఒకటి ప్రభాస్ గెస్ట్ రోల్ లో చేస్తున్న కన్నప్ప.
Also Read : చిరంజీవి – అనీల్ రావిపూడి మూవీ బ్యాక్ డ్రాప్ ఇదే
ఇక ప్రభాస్ ప్రస్తుతం… మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా ట్రైలర్ లేదా టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు గట్టిగానే ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ ఇటీవల కాలికి గాయం కారణంగా సినిమా షూటింగ్ కు దూరంగా ఉన్నాడు. ఇక లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం… ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో సినిమా టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read : బెట్టింగ్ యాప్స్.. సినిమా వాళ్ళపైనే పోలీసుల గురి
ఈ వేసవిలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఏప్రిల్ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మే చివరి వారంలో లేదంటే.. జూన్ మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉండవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి. షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ప్రభాస్ పోర్షన్ ఇంకో పది రోజులు పెండింగ్ ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతే ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఆ సినిమా షూటింగ్ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు.