తెలంగాణా ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 2025-26 బడ్జెట్ అంచనాలు ఒకసారి చూస్తే.. మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు కాగా వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు కేటాయించారు. పశు సంవర్ధక శాఖకు 1,674 కోట్లు, పౌరసరఫరాల శాఖకు 5,734 కోట్లు కేటాయించారు. విద్యాశాఖకు 23,108 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి 31,605 కోట్లు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమం కు 2,862 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.
Also Read : జగన్‌లో మార్పు వచ్చిందా.. వస్తుందా..?
రైతులకు రూ.20, 616 కోట్లు రుణ మాఫీ చేసామని… రైతు భరోసా కింద ఎకరాకు రూ.12000 ఇస్తున్నామని… రైతు భరోసాకు రూ.18000 కోట్ల బడ్జెట్ కేటాయించామని అన్నారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్.. 40 లక్షల ఎకరాల్లో సన్న వడ్లసాగు విస్తరణకు నిధులు కేటాయించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంపు.. ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు రూ.2000 అదనపు సబ్సిడీ ఇవ్వనున్నట్టు తెలిపారు. వడ్ల బోనస్ కింద రైతులకు రూ.1,206 కోట్లు చెల్లింపు.. తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింది అన్నారు.
Also Read :పిచ్చి పది రకాలు.. అందులో ఇది కూడా ఒకటి..!
57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసామని… తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరించామని తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు కేటాయించామని తెలిపారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు అందిస్తామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి జోడు గుర్రాలు అని… అధికార పీఠం హోదాగా భావించడం లేదన్నారు. దశాబ్దకాలం పాలన వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని తెలిపారు. నిరాధార ఆరోపణలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో సవాళ్లను అధిగమించామన్నారు.