Monday, October 27, 2025 07:47 PM
Monday, October 27, 2025 07:47 PM
roots

త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చేసాడు.. బన్నీ షాకింగ్ స్టెప్

పుష్ప సినిమా తర్వాత.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిపోయాడు. దీనితో అతని తర్వాతి సినిమా ఏంటి అనే దానిపై జనాల్లో తెలియని ఇంట్రెస్ట్ నెలకొంది. ప్రస్తుతం కెరీర్ పరంగా అల్లు అర్జున్ చాలా బిజీగా ఉన్నాడు. వరస ప్రాజెక్టులతో అల్లు అర్జున్ రాబోయే మూడు నాలుగేళ్లు బిజీగానే గడపనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ, మరో తెలుగు స్టార్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇలా వరుస ప్రాజెక్టులు.. అల్లు అర్జున్ కోసం రెడీగా ఉన్నాయి.

Also Read : సునీత విలియమ్స్ జీతం ఎంత..? ఈ 9 నెలలకు ఆమె ఎంత తీసుకుంటుంది..?

ఇదే టైంలో సుకుమార్ తో పుష్ప మూడో పార్ట్ కూడా రెడీ అవుతుంది అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు… వచ్చిన ఒక న్యూస్ సెన్సేషన్ అయింది. అల్లు అర్జున్.. పుష్ప సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తాడని అందరూ ఎదురు చూశారు. దీనికి సంబంధించి అప్పట్లో అఫీషియల్ ప్రకటన ఒకటి మాత్రమే రాలేదు. మిగిలినవి మొత్తం జరుగుతున్నాయని.. స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని, ఒక రాజు కథను అద్భుతంగా చూపించేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేశాడని ప్రచారం జరిగింది.

Also Read : రాజమౌళి – మహేష్ ప్రాజెక్ట్ పై బాలీవుడ్ మీడియా ఫోకస్

కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఆగిపోయినట్లు సమాచారం. సినిమాపై అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని.. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కథ విషయంలో అల్లు అర్జున్ చెప్పిన మార్పులు చేయడానికి.. అంత ఇంట్రెస్ట్ చూపించలేదని, అందుకే సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎక్కడా.. బయట పెట్టకుండా చాలా జాగ్రత్తగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో సినిమా మొదలు పెట్టేసాడు అల్లు అర్జున్.

Also Read : రాజమౌళి – మహేష్ మూవీ లీక్.. టెక్నీషియన్ కు భారీ జరిమానా

ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు తో పాటుగా కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో కంటే వేరే రాష్ట్రాల్లోనే ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా జరగనుందట. తమిళనాడులో ఉన్న ఫేమస్ లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరపాలని డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు టాక్. దీనితో త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అల్లు అర్జున్ పక్కన పెట్టేసినట్లేనని టాలీవుడ్ వర్గాలు ఉంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్