Friday, September 12, 2025 09:20 PM
Friday, September 12, 2025 09:20 PM
roots

అసెంబ్లీ సాక్షిగా కూటమిలో విభేదాలు..!

మేము మరో 15 ఏళ్ల పాటు కలిసే ఉంటాం… మా మధ్య పొత్తు 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది.. అంటూ కూటమి పార్టీ అగ్రనేతలు ఓ వైపు పదే పదే చెబుతుంటే… కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు మాత్రం… ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు ప్రదర్శించుకుంటున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ… ప్రతిపక్షం కంటే ఎక్కువగానే వ్యవహరిస్తున్నారు. పైకి కలిసే ఉన్నప్పటికీ… లోపల మాత్రం మీరు వేరు.. మేము వేరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే పలుమార్లు బహిరంగ వేదికలపైన, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా నువ్వేంత అంటే నువ్వేంత అన్నట్లుగా కూటమి నేతలు వ్యవహరించారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

Also Read : ఆ 15 రోజులు బోరుగడ్డ ఎక్కడ…?

అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు. అటు మండలిలో మాత్రం వైసీపీ నేతల ప్రశ్నలకు కూటమి నేతలు ధీటుగా జవాబిస్తున్నారు. తల్లికి వందనం, రాజధాని అమరావతి నిర్మాణం, అప్పులు, జగన్ సర్కార్ అరాచకాలు వంటి అంశాలపై కూటమి నేతలు మండలిలో వైసీపికి చురకలు అంటిస్తూనే ఉన్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలకు సవాల్ కూడా విసురుతున్నారు. ముందు మీ నేతను అసెంబ్లీకి రమ్మని చెప్పండి… ఆ తర్వాత మీ అన్ని అనుమానాలు తీర్చేస్తామని మంత్రులు వైసీపీ ఎమ్మెల్సీలపై సెటైర్లు వేస్తున్నారు.

Also Read : రూటు మార్చిన ఏపీ పోలీసులు..

అయితే ఇదే సమయంలో అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తాజాగా బడ్జెట్‌‌లో కార్మిక శాఖకు కేటాయింపులపైన, కార్మికుల సమస్యలపైన చర్చించేందుకు బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజుకు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య మాటల యుద్ధం తలెత్తింది. నేను ఎవరో తెలుసా అంటూ విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను బీజేపీ ఫ్లోర్ లీడర్‌ను.. నేను ప్రజా సమస్యలపై చర్చించేందుకు మాత్రమే సభకు వస్తాను.. అన్నారు. నేను బీజేపీ తరఫున ఎన్నికయ్యాను.. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చేందుకే నన్ను గెలిపించారు… అంటూ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. సభలో మాట్లాడకుండా ఖాళీగా కుర్చోమంటారా… చెప్పండి.. సభలో నాకు మాట్లాడేందుకు ఎంత సమయమిస్తారో చెప్పండి.. అంటు అసహనం వ్యక్తం చేశారు. నేను మాట్లాడకుండా ఉండాలంటే… చెప్పండి అంటూ విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి నేతల మధ్య మరింత అగాధం సృష్టించేలా ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్