దాదాపు రెండు నెలల నుంచి.. వైసీపీకి మద్దతిచ్చి అప్పట్లో రెచ్చిపోయిన నాయకులకు పోలీసులు గురిపెట్టారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, అలాగే సినీ నటుడు పోసాని కృష్ణ మురళిలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. వీళ్ళిద్దరికీ కోర్టులు రిమాండ్లు విధించడంతో ఇద్దరు జైల్లోనే ఉన్నారు. ఇక త్వరలో ఎవరిని అదుపులోకి తీసుకోబోతున్నారు అనేదానిపై స్పష్టత రావడం లేదు.
Also Read : అమరావతి పనుల ప్రారంభంపై క్లారిటీ..!
అయితే మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ప్రధానంగా వినపడుతోంది. తాజాగా ఆయనకు ఏపీ పోలీసులు నోటీసులు పంపారు. జగన్ హయాంలో కాకినాడ శ్రీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ లో 3,600 కోట్లు విలువైన వాటాలను వాటి యజమాని కేవీ రావు నుంచి బలవంతంగా లాక్కున్న కేసులో విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది. బుధవారం ఉదయం విజయవాడ సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది.
Also Read : ఇలా అయితే కష్టమే.. బాబు మాస్ వార్నింగ్..!
రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్ళిన సిఐడి అధికారులు.. ఆయన అందుబాటులో లేకపోవడంతో విజయసాయిరెడ్డి భార్యకు నోటీసులు అందించారు. విజయసాయి ఇందులో ఏ 2గా ఉండగా.. జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి కుమారుడు.. విక్రాంత్ రెడ్డి ఏ 1 గా ఉన్నారు. వాటాలు లాక్కున్న వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడి అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి కేసు కూడా నమోదు చేశారు.
Also Read : చంద్రయ్య కేసు సిఐడీకి.. న్యాయం జరుగుతుందా..?
రెండు నెలల కిందట సాయి రెడ్డిని ఈడి విచారించగా ఇప్పుడు సిఐడి అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు. ఇక ఈడీ అధికారుల రంగంలోకి దిగడంతో విజయసాయిరెడ్డి.. రాజకీయాల నుంచి తప్పుకున్నారు. వెంకటేశ్వరరావు వాటాలను ఆయనకు అప్పగించేసినట్లుగా వార్తలు వచ్చాయి. అది జరిగిన కొన్ని రోజులకు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారు.