Friday, September 12, 2025 08:51 PM
Friday, September 12, 2025 08:51 PM
roots

బోరుగడ్డ వస్తాడా…? పోలీసుల్లో పెరుగుతోన్న ఉత్కంట

గుంటూరుకు చెందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియనున్న నేపధ్యంలో అతను జైలుకు తిరిగి వస్తాడా లేదా అనేది ఆసక్తిగా మారింది. బోరుగడ్డ రాజమహేంద్రవరం కారాగారంలో లొంగిపోతాడా? లేదా అన్నదానిపై పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది. అనిల్ తన తల్లికి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని గుంటూరు లలితా సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ పీవీ రాఘవశర్మ సిఫార్సు చేసినట్లు నకిలీ మెడికల్ సర్టిఫికెట్ కోర్టుకు సమర్పించి ఈ నెల 1న మధ్యంతర బెయిలు తీసుకున్నాడు.

Also Read :ఐపిఎల్ కు కేంద్రం షాక్.. ఆ ప్రకటనలు అన్నీ బ్యాన్

ఆ మెడికల్ సర్టిఫికెట్ తామివ్వలేదని ఆసుపత్రి వైద్యుడు రాఘవశర్మ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తప్పుడు వైద్య ధ్రువపత్రంతో బెయిలు గడువు పొడిగించుకున్న విషయాన్ని పోలీసులు ఇప్పటికే ప్రభుత్వ న్యాయవాదికి తెలియజేసి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ మోసంపై హైకోర్టు సీరియస్ అయ్యే అవకాశం ఉందని, కేసు నమోదుకు ఆదేశించవచ్చని వార్తలు వస్తున్నాయి.

Also Read :చంద్రబాబు సీఎం పదవి.. పవన్ పుణ్యమే..!

తమ ఆసుపత్రి పేరుతో లెటర్ హెడ్ సృష్టించినందుకు లలితా ఆసుపత్రి యాజమాన్యం అతనిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సమాచారం. గుంటూరులో మరో చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. అనిల్ ఒకవేళ జైలులో లొంగిపోకపోతే హైకోర్టు ఇచ్చే ఆదేశాల అమలుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని మధ్యంతర బెయిల్ పొడిగించుకున్న అనిల్ ఆమెకు శస్త్రచికిత్స జరిగినప్పుడు, ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయినప్పుడు ఆమె వెంట లేడని పోలీసులు నిర్ధారించారు.

Also Read :సినిమాల్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. స్టోరీ లైన్ కూడా చెప్పేశారు…!

తల్లికి సహాయంగా ఉండాలని చెప్పి జైలు నుంచి బయటకొచ్చిన అనిల్ ఇన్నాళ్లూ ఎక్కడున్నాడు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరెవరిని కలిశాడు… ఎవరితో ఫోన్లో మాట్లాడాడన్నదానిపై పోలీసులు కొంత సమాచారం కూడా ఇప్పటికే సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ అతని ఇంటి వద్ద ఎవరూ లేరని, ఫోన్లు స్విచ్ ఆఫ్ లోనే ఉన్నాయని పోలీసులకి సమాచారం అందింది. మరోవైపు అనిల్ పై పట్టాభిపురం స్టేషన్లో పీటీ వారంట్ పెండింగ్ లో ఉండటంతో కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఫైల్ సిద్ధం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్