Friday, September 12, 2025 09:13 PM
Friday, September 12, 2025 09:13 PM
roots

ఇప్పుడైనా కలిసిపోతారా.. కుంపట్లు పెడతారా..?

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి దాదాపుగా ముగిసినట్లుగానే కనపడుతోంది. రాజకీయంగా దాదాపు వారం రోజుల నుంచి ఈ వ్యవహారం హీట్ పెంచింది. సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఓ అంగీకారానికి రావడం, జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి బీద రవిచంద్ర యాదవ్, బిటి నాయుడు, కావలి గ్రీష్మ.. బిజెపి నుంచి సోము వీర్రాజుకు సీట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఈ స్థానాల విషయంలో.. ఇప్పటి వరకు ఏ అభ్యంతరాలు లేకపోయినా.. ఇప్పుడు బిజెపికి కేటాయించిన సీటు విషయంలో మాత్రం టీడీపీ క్యాడర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.

Also Read :ఇలా అయితే కష్టమే.. బాబు మాస్ వార్నింగ్..!

సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడాన్ని టీడీపీ క్యాడర్ తప్పుబడుతోంది. 2014 లో టీడీపీ – బిజెపి కలిసి పోటీ చేయగా… అప్పుడు మిత్రపక్షంగా ఉండి కూడా బిజెపి నేతలు చంద్రబాబును టార్గెట్ చేయడంలో సోము వీర్రాజు కీలక పాత్ర పోషించారు. ఆయన కూడా స్వయంగా పదే పదే చంద్రబాబును తిట్టడం, వైఎస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరించడం వంటివి జరిగాయి. అప్పట్లో టీడీపీ ఎన్డియే నుంచి బయటకు రావడానికి ఆయనే ప్రధాన కారణం అనే విషయంలో దాదాపుగా అందరికి ఓ అవగాహన ఉంది.

Also Read :ఫైబర్ నెట్ మరో సంచలనం.. మంత్రికి దినేష్ కుమార్ నివేదిక..!

ఇక బిజెపి అధ్యక్షుడిగా కూడా రాష్ట్రంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. అయితే టీడీపీ మళ్ళీ బిజెపికి దగ్గరైన తర్వాత సోము వీర్రాజు పెద్దగా.. మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా ఆయన సైలెంట్ గానే ఉంటూ వచ్చారు. జగన్ కు ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని అంటూ ఉంటారు. దీనితో మళ్ళీ ఆయన కూటమిలో చిచ్చు పెట్టడం ఖాయం అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ప్రస్తుతం బిజెపి నేతలు సఖ్యతగానే ఉంటున్నా… మళ్ళీ సోముకు పదవి రావడంతో ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్