Saturday, September 13, 2025 03:27 AM
Saturday, September 13, 2025 03:27 AM
roots

భారత్ ఆ ఇద్దరినీ ఆపుతుందా…?

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో.. అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టు ఈసారి ఎలాగైనా సరే మెగా టోర్నీని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తోంది. అటు టీమ్ ఇండియా కూడా కెప్టెన్ రోహిత్ శర్మకు ఛాంపియన్ ట్రోఫీ కానుకగా ఇవ్వాలని.. పట్టుదలగా పక్కా వ్యూహంతో బరిలోకి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అయితే ఇప్పుడు భారత జట్టుకు.. ఇద్దరు ఆటగాళ్ల నుంచి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

Also Read : కోహ్లీతో రాహుల్ బాండింగ్ వేరే లెవెల్..!

ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆ జట్టు సీనియర్ ఆటగాడు కెన్ విలియమ్సన్ కీలక ఇన్నింగ్స్ లు ఆడుతూ ఉంటాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో 81 పరుగులతో రాణించిన ఈ స్టార్ ఆటగాడు.. సౌత్ ఆఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఇతనితోపాటు నిలకడగా రాణిస్తున్న రచిన్ రవీంద్ర కూడా భారత జట్టును ఇబ్బంది పెట్టే సంకేతాలు కనబడుతున్నాయి. ఆల్రౌండర్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ కు ప్రధాన ఆయుధంగా మారాడు ఈ ఓపెనర్.

Also Read : కోహ్లీ ఫిట్నెస్ కు ఓ దండం..!

మరో ఓపెనర్ పెద్దగా రాణించకపోయినా.. అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్ లాడుతూ.. ఈ టోర్నీలో ఇప్పటివరకు రెండు సెంచరీలు సాధించాడు. తొలి 15 ఓవర్లలో సాధ్యమైనంత పరుగులు చేసి ఆ తర్వాత కాస్త నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు రచిన్. 2023 వన్డే ప్రపంచ కప్ లో మూడు సెంచరీలు చేసిన ఈ భారత సంతతి ఆటగాడు.. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అదే స్థాయిలో ప్రదర్శన చేస్తున్నాడు. దీనితో ఫైనల్ మ్యాచ్ లో భారత్ కు ఈ ఇద్దరి ఆటగాళ్లతో పక్కాగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్లిద్దరిని కట్టడి చేస్తేనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే డార్లి మిచెల్ కూడా అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ కూడా సెమీఫైనల్ మ్యాచ్ లో దూకుడుగా బ్యాటింగ్ చేసే జట్టుకు భారీ స్కోర్ అందించాడు. కాబట్టి కీలక ఆటగాళ్లపై భారత జట్టు ఫోకస్ పెట్టాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్