రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇక సినిమా షూటింగ్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. రాజమౌళి సినిమా అనగానే షూటింగ్ ఎక్కడ జరుగుతుంది.. సినిమాలో ఏ సీన్స్ ఉంటాయి.. రాజమౌళి ఎలివేషన్ ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడు.. అంటూ జనాల్లో ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కాబట్టి సూపర్ స్టార్ ను ఏ రేంజ్ లో ఎలివేట్ చేయబోతున్నాడు… అనేది జనాల్లో ఉన్న ఇంట్రెస్టింగ్ సస్పెన్స్.
Also Read : మళ్ళీ దేవినేని వర్సెస్ వంగవీటి.. ఎవరు నిలుస్తారో…?
ఇప్పటివరకు హైదరాబాద్ లోని.. రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ జరగగా.. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా షూటింగ్ కోసం బుధవారం అక్కడికి వెళ్లిన.. మూవీ యూనిట్ అక్కడ దేవ్ మాలి అనే పర్వతంపై షూటింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఇక వీళ్ళతోపాటు మలయాళ యాక్టర్ పృధ్విరాజ్ సుకుమారన్ కూడా అక్కడికి వెళ్ళాడు. గతంలో అతను ఈ సినిమాలో నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు అక్కడికి డైరెక్ట్ గా వెళ్లడంతో.. కచ్చితంగా సినిమాలో నటిస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చేసింది.
Also Read : ఎమ్మెల్సీ అభ్యర్ధుల పై చంద్రబాబు సంచలన నిర్ణయం
ఈనెల 28 వరకు ఒడిస్సాలోని కీలక ప్రాంతాల్లో… ఇప్పటికే సెలెక్ట్ చేసిన లొకేషన్స్ లో షూటింగ్ జరుగుతుంది. తోలోమాలి అనే పర్వతంపై ఇప్పటికే ఒక సెట్ కూడా వేశారట. కొద్ది రోజుల్లో మిగిలిన నటులు కూడా అక్కడికి వెళ్ళనున్నారు. ఈ సినిమా రెండు పార్ట్ లుగా రానుండగా, మొదటి పార్ట్ వచ్చేయేడాది.. జనవరి నాటికి రిలీజ్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నాడు. గతంలో సినిమాలు కంటే ఈ సినిమాను చాలా ఫాస్ట్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక రెండో పార్ట్ మాత్రం 2028లో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఒడిశాలో షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంది అనే వార్తలు వస్తున్నాయి.