ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 14 ఏళ్ల తర్వాత భారత్ విజయం సాధించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. నాలుగు వికెట్ల తేడాతో దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయకేతనం ఎగరవేసింది. ఈ విజయంతో సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ ఎవరితో తలపడుతుంది అనేది బుధవారం తేలిపోనుంది. ఆస్ట్రేలియా తో మ్యాచ్ అనగానే భారత్ ముందు ఒత్తిడికి లోనైంది. అటు అభిమానులు కూడా ఆస్ట్రేలియా పై గెలవడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Also Read :ఆస్ట్రేలియా అంటే ఎందుకింత భయం..?
గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న అభిమానులు భారత్ వ్యూహాత్మంగా ఆడితే మినహా.. గెలవడం కష్టం అంటూ జట్టుకు ఎన్నో సూచనలు చేశారు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ భారత్ దుమ్మురేపింది. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ మెరుగైన ప్రదర్శన చేయడంతో ఆస్ట్రేలియా దూకుడుగా పరుగులు చేయలేకపోయింది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు తక్కువ పరుగులకే అవుట్ అయినా.. సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ శ్రేయాస్ అయ్యర్, కెఎన్ రాహుల్ నిలకడగా రాణించడంతో భారత్ విజయం సాధించింది.
Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వరుస గిఫ్ట్ లు రెడీ…!
అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కోహ్లీతోపాటు క్రీజ్ లో ఉన్న కేఎల్ రాహుల్.. కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేను హిట్టింగ్ చేస్తున్నా కదా..? అంటూ కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీ అవుట్ అయిన వెంటనే ఇచ్చిన రియాక్షన్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. వాస్తవానికి వీళ్ళిద్దరూ డ్రెస్సింగ్ రూమ్ లోనే కాకుండా బయట కూడా మంచి స్నేహితులు.
Also Read : సైలెంట్ గా షైన్ అయ్యాడు..
ముందు నుంచి విరాట్ కోహ్లీని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటాడు రాహుల్. ఇక రాహుల్ కు విరాట్ కోహ్లీ కష్ట సమయంలో అండగా నిలబడ్డాడు. జట్టు నుంచి నిషేధానికి గురైన సమయంలో కోహ్లీ నుంచి కేఎల్ రాహుల్ కు మంచి మద్దతు లభించింది. దానికి తోడు టాలెంట్ కూడా పుష్కలంగా ఉండటంతో విరాట్ కోహ్లీ.. కేఎల్ రాహుల్ ను అన్ని విధాలుగా షైన్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇలా వీళ్ళిద్దరి బాండింగ్ అభిమానులకు ముందు నుంచి నచ్చుతూ ఉంటుంది. తాజాగా కేఎల్ రాహుల్ చేసిన కామెంట్ పై అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.