Saturday, September 13, 2025 01:04 AM
Saturday, September 13, 2025 01:04 AM
roots

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వరుస గిఫ్ట్ లు రెడీ…!

త్రిబుల్ ఆర్, దేవర సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా దుమ్మురేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నాడు. దేవర సినిమా సక్సెస్ తో ఈ సినిమా షూటింగ్ లో మంచి ఎనర్జీతో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. అటు బాలీవుడ్ సినిమా వార్ 2 షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ కు అటెండ్ అవుతున్నాడు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనే ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా హైదరాబాదులో 3000 మంది ఆర్టిస్టులతో షూటింగ్ స్టార్ట్ చేశారు.

Also Read : పీవీ సునీల్ కోసం రంగంలోకి దిగారా..?

ఇక సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ ఈ సినిమా కోసం యూనిక్ స్క్రిప్ట్ రెడీ చేశారని.. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దానికి స్కై ఈజ్ ది లిమిట్ అని చెప్పేసి.. సినిమాపై అంచనాలు భారీగా పెంచేసారు. ఇది ఇంటర్నేషనల్ స్థాయి కథ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.

Also Read : రాకున్నా.. వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారేమిటో…!

వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు వేరే లెవల్ కి వెళ్ళాయి. ఇప్పుడే రవిశంకర్ చేసిన కామెంట్లతో అంచనాలు రెట్టింపు చేశారు. సినిమాను అనుకున్న టైం కు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు రవిశంకర్. ఇక ఈ సినిమా గురించి అప్డేట్స్ వరుసగా ఇచ్చేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఉగాదికి పక్కాగా సినిమా నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉందని.. శ్రీరామనవమికి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని అలాగే జూన్ లో సినిమాకు సంబంధించి గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ లేట్ చేయకుండా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని డైరెక్టర్ టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే సలార్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉండటంతో డైరెక్టర్ లేట్ చేయడం లేదు. కచ్చితంగా సినిమాను జనవరి 9 కి రిలీజ్ చేసేందుకు పక్క ప్లానింగ్ తో దిగుతున్నారు మేకర్స్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్