Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

చంద్రబాబుపై జీవీ రెడ్డి వ్యాఖ్యలు.. ఇదేంటి మళ్లీ..!

ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి ప్రయాణమెటు… నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉంటారా.. చెప్పినట్లుగా అసలు రాజకీయాల గురించి మాట్లాడరా.. లేదంటే అందరు రాజకీయ నేతల మాదిరిగానే వేరే పార్టీల్లో చేరిపోతారా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. నాలుగున్నర ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన జీవీ రెడ్డి… జగన్ సర్కార్ అక్రమాలపైన, ప్రతి వారం చేస్తున్న అప్పుల పైన ప్రజలకు వివరించారు. జగన్ సర్కార్ ఆర్థిక నేరాలను ప్రజలకు వివరించారు. చివరికి ఎన్నికల్లో వైసీపీ ఓటమిలో తన వంతు పాత్ర కూడా బలంగానే పోషించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేశాడు జీవీ రెడ్డి.

Also Read : ఆయుధం ఉన్నా వాడని టీం ఇండియా…!

జీవీ రెడ్డి పనితీరుతో సంతృప్తి చెందిన చంద్రబాబు… ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ చైర్మన్‌గా నియమించారు. అయితే ఐఏఎస్ అధికారి, మాజీ ఎండీ దినేష్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జీవీ రెడ్డి. చైర్మన్ మాట కూడా లెక్క చేయడం లేదని అసహనంతో ఫైబర్‌నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జీవీ రెడ్డికి మద్దతు తెలిపారు. అయితే చంద్రబాబు మాత్రం ఫైబర్‌నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి చేసిన రాజీనామాను వెంటనే అంగీకరించారు. మరోవైపు జీవీ రెడ్డిని ఎమ్మెల్సీగా పంపేందుకు టీడీపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు.

Also Read : ఒంటిపూట బడులపై ఏపీ సర్కార్ క్లారిటీ..!

ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్‌పై జీవీ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. రూ.3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌లో రూ.33 వేల కోట్ల అతితక్కువ రెవెన్యూ లోటుతో ఏపీ ప్రభుత్వం అద్భుతమైన భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని ప్రశంసల వర్షం కురిపించారు జీవీ రెడ్డి. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ… చంద్రబాబుపైన అభిమానం, గౌరవం అలాగే ఉంటుందని కూడా జీవీ రెడ్డి ట్వీట్టర్‌లో ప్రస్తావించారు. తక్కువ కాలంలోనే తనకు గౌరవప్రదమైన బాధ్యతలు కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా సీఎం కావాలని జీవీ రెడ్డి కోరుకున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్