Friday, September 12, 2025 08:53 PM
Friday, September 12, 2025 08:53 PM
roots

బడ్జెట్ పై చంద్రబాబు మల్లగుల్లాలు.. అసలేం చేద్దాం…?

రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2024-25 సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో 5 నెలల కాలానికి గాను నవంబర్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 28వ తేదీ సభ ముందుకు బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది.

Also Read : అధికారులపై చంద్రబాబు సీరియస్..!

గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో ఆర్థిక ఆరోగ్యసూచిలో అట్టడుగున రాష్ట్రం నిలవడంతో గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతోంది. భవిష్యత్ ఆదాయాలను కూడా వాడేసిన గత ప్రభుత్వం.. క్యాపిటల్ ఎక్స పెండిచర్ పై నిధులు ఖర్చు చేయకపోవడంతో ప్రతి కూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ఉచిత ఇసుక వంటి పాలసీతో ఆదాయం వదులుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన మొదటినెల నుంచే పింఛన్ల పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పై సరాసరి నెలకు రూ. 2720 కోట్లు వెచ్చిస్తోంది.

Also Read : మాజీ కాంగ్రెస్ ఎంపీల కోసం అన్న తంటాలు

దీనికి తోడు దీపం 2, అన్న క్యాంటీన్లు వంటి పథకాలూ ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఈ ఏడాది నంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు వంటి పథకాలకు ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ కూర్పు సవాల్ గా మారింది. అటు పథకాలు, ఇటు అభివృద్ది కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయంతో కొంత ఊరట లభించగా రాష్ట్ర అర్థిక స్థితిగతుల నేపథ్యంలో ప్రత్యేక సాయం అధించాలని 16వ అర్థిక సంఘాన్ని సిఎం చంద్రబాబు కోరారు. అయితే సంక్షేమం ఇస్తూ… అభివృద్ది పనులను కొనసాగిస్తామని సర్కార్ ధీమాగా చెప్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్