Sunday, June 21, 2026 02:44 AM
Sunday, June 21, 2026 02:44 AM

కుంకీ ఏనుగులు కోసం రంగంలోకి సీఎం..!

ఆంధ్రప్రదేశ్ లో ఏనుగుల బెడద ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలను కంగారుపడుతుంది. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు అలాగే ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల ప్రభావం ఎక్కువగా ఉంది. పంట పొలాలను రైతులు కాపాడుకోవడానికి భయపడిపోతున్నారు. పెద్ద ఎత్తున ఏనుగులు గ్రామాల్లోకి రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న రైతులు వ్యవసాయం మానేసి వలస వెళ్లిపోతున్నారు. అరటి, చెరుకు వంటి పంటలను పెద్ద ఎత్తున ఏనుగులు నాశనం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read : మాజీ కాంగ్రెస్ ఎంపీల కోసం అన్న తంటాలు

నాలుగు నెలల క్రితం ఏపీ ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్.. బెంగళూరు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. కర్ణాటకలో ఉన్న కుంకి ఏనుగులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు.. ఆయన కర్ణాటక అటవీ శాఖతో ఒప్పందం చేసుకున్నారు. కర్ణాటకలో 40 ఏనుగులు ఉండగా వాటిలో నాలుగు ఏనుగులను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు. చిత్తూరుకు రెండు ఏనుగులు, అలాగే ఉత్తరాంధ్రకు రెండు ఏనుగులు చొప్పున కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

Also Read : మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. విద్యాశాఖ కీలక ప్రకటన

దీనికోసం ఎంఓయు కూడా కంప్లీట్ అయింది. దానికి తోడు అటవీ శాఖ అధికారులకు ఆ ఏనుగులను ఎలా డీల్ చేయాలో శిక్షణ కూడా ఇచ్చారు. దాదాపు నెలరోజుల పాటు శిక్షణ కొనసాగింది. అయినా సరే ఇప్పటివరకు ఏనుగులు రాలేదు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఉప సర్పంచ్ ను ఏనుగులు చంపటంపై ఆందోళన వ్యక్తం అయింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. తాజాగా సచివాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Also Read : సోమవారం టెస్ట్ పాస్ అయిన తండేల్.. అంచనాలకు మించి కలెక్షన్లు

అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాముతో మాట్లాడిన చంద్రబాబు.. జనావాసాలు పంట పొలాలపై ఏనుగుల దాడులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని అడ్డుకునేందుకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను త్వరగా తీసుకురావాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఈ ప్రాజెక్టు విషయంలో ఆలస్యం చేయొద్దని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనితో త్వరలోనే అటవీ శాఖ బృందం కర్ణాటక వెళ్లనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్