నాగచైతన్య – సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన తండేల్ సినిమా ఓవర్సీస్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాగచైతన్య కెరీర్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాపై అక్కినేని ఫ్యామిలీ చాలా హోప్స్ పెట్టుకుంది. ఎలాగైనా సరే ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టాలని అక్కినేని హీరోలు టార్గెట్ పెట్టుకున్నారు. నాగచైతన్య కూడా ఈ సినిమా కోసం గట్టిగానే కష్టపడ్డాడు. దాదాపు రెండేళ్ళ పాటు ఈ సినిమా కోసం టైం పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో నటించిన సాయి పల్లవి కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది.
Also Read: బాలయ్యను అడ్డంపెట్టి రేవంత్ ను బుట్టలో వేస్తారా..?
ఆమె యాక్షన్ కు జనాలు ఫిదా అయిపోయారు. ఇక ఓవర్సీస్ మార్కెట్ విషయానికొస్తే అమెరికాలో ఈ సినిమా మంచి రెస్పాన్స్ సాధిస్తోంది. రిలీజ్ కు ముందే రెండు లక్షల డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత 3,60,000 డాలర్లు వసూలు చేసింది. దీనితో కచ్చితంగా వన్ మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయమని అక్కినేని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో అల్లు అరవింద్.. అమెరికాను అలాగే యుకేను గట్టిగానే టార్గెట్ చేశారు. దీనితో ఓవర్సీస్ లో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
Also Read: బాలయ్యను అడ్డంపెట్టి రేవంత్ ను బుట్టలో వేస్తారా..?
ఇక సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి పాజిటివ్ రివ్యూలు ప్లస్ అవుతున్నాయి. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందని టాక్ వస్తుంది. ఈ మధ్య నాగచైతన్య చేసిన సినిమాలకు పెద్దగా హడావుడి ఉండటం లేదు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అభిమానుల్లో గట్టిగానే బజ్ క్రియేట్ అయింది. అందుకే సినిమాకు వసూళ్లు కూడా భారీగా వస్తున్నాయి. ఇక లాంగ్ రన్ లో ఓవర్సీస్ మార్కెట్లో ఖచ్చితంగా సినిమా భారీగా వసూలు చేసే ఛాన్స్ ఉందని అంచనాలు వేస్తున్నారు.