సినిమాల కంటే అక్కినేని నాగార్జున రాజకీయాల్లో కాస్త ఎక్కువగా ఫేమస్ అవుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సినిమాలు మానేసి వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి పెట్టిన నాగార్జున… రాజకీయ నాయకులతో మంచి సంబంధాల కోసం ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాగార్జునకు అనుకూలంగా పరిస్థితులు కనబడటం లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగార్జున విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అంతగా నాగార్జునకు సహకారం అందించే పరిస్థితి లేదు. దీనికి కారణాలు బహిరంగ రహస్యమే. అక్కినేని నాగార్జున అటు వైఎస్ జగన్ కి, ఇటు కెసిఆర్ కి ఆప్తుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Also Read: మెగా ఫ్యాన్స్ ను కెలికిన అల్లు మామ..!
వైఎస్ జగన్ తో నాగార్జున వ్యాపారాలు చేస్తారనే కారణంతో ఆయనను పక్కన పడుతుంది టిడిపి అనే అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇప్పుడు నాగార్జున బిజెపి పెద్దలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బిజెపి కి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇమేజ్ ఉన్న నటుల అవసరం ఎంతైనా ఉందన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని నరేంద్ర మోడీతో హీరో నాగార్జున ఫ్యామిలీ నేడు భేటీ అయింది. కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిసేందుకు అక్కినేని నాగార్జున.. ఆయన భార్య అమల అలాగే ఆయన కుమారుడు నాగచైతన్య, కోడలు శోభిత పార్లమెంటుకు వెళ్లారు.

గతంలో నాగార్జున పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినా ఈ పర్యటన మాత్రం కాస్త ఆసక్తిని రేపుతోంది. ఇటీవల దివంగత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పై నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషిని ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ కొనియాడారు. ఇక మోడీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియాలో రియాక్ట్ కూడా అయ్యారు. అయితే లేటెస్ట్ మీటింగ్ ఎందుకు జరిగింది ఏంటి అనే దానిపై క్లారిటీ లేకపోయినా.. మీటింగ్ అక్కినేని నాగేశ్వరరావు బయోగ్రఫీ లాంచ్ గురించి అని వార్తలు వస్తున్నాయి.
Also Read: చీరాలలో గ్రూపు రాజకీయాలకు తెరతీసిన మాజీ ఎమ్మెల్యే..!
అయితే ప్రధానిని కలిసే ముందు నాగార్జున పార్లమెంట్లోని టిడిపి ఆఫీస్ కి వెళ్లడం సంచలనమైంది. అక్కడ పలువురు ఎంపీలతో ఆయన మాట్లాడారు.. ఈ క్రమంలోనే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి.. నాగార్జునతో ఫోటో దిగి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. వాస్తవానికి నాగార్జున టిడిపికి దూరంగానే ఉంటారు. అలాంటిది పార్లమెంట్ లో టిడిపి ఆఫీసులో ఆయన ప్రత్యక్షం కావడం సంచలనం అవుతుంది.