Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

ఆరని మంచు మంటలు.. కలెక్టర్ ఆఫీస్ లో రచ్చ..!

మంచు ఫ్యామిలీలో మొదలైన గొడవ ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు. దాదాపు నెల రోజుల క్రితం మంచి ఫ్యామిలీలో ఆస్తుల గొడవ… అలాగే యూనివర్సిటీ గొడవ తెలుగు సినిమా పరిశ్రమను పరువు తీసింది అనే విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా మరోసారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వద్దకు ఈ గొడవ వెళ్ళింది. ఆస్తి తగాదాల విషయంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు అలాగే ఆయన కుమారుడు మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ లోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం వీళ్ళిద్దరూ ప్రత్యక్షమయ్యారు.

Also Read: ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఏబీవీ పోస్టింగ్

తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు ఒక లేఖ పంపించారు. బాలాపూర్ మండలం జల్‌పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించాడని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నాడని, అందులో ఆయన ప్రస్తావించారు. మోహన్ బాబు వేసిన పిటిషన్ పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎదుట ఇటీవల మంచు మనోజ్ హాజరై తన వివరణ ఇచ్చారు. ఇక తాజాగా ఈరోజు మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు కలెక్టర్ వద్దకు వచ్చి తన ఆస్తులు మనోజ్ అక్రమంగా ఆక్రమించారని.. మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.

Also Read: నా ట్విట్టర్ నేను వాడలేదు.. షర్మిల ముందు విజయసాయి సంచలన విషయాలు…!

తన స్వార్జిత ఆస్తిపై ఎవరికి హక్కు లేదని, మనోజ్ నా ఆస్తులు అప్పగించాలని మోహన్ బాబు స్పష్టం చేశారు. ఎవరికోసమో ఈ ఆస్తులను తన వద్ద నుంచి లాక్కోవాలని మనోజ్ ప్రయత్నం చేస్తున్నాడని, అందుకు తాను ససేమిరా అంగీకరించే ప్రశ్న లేదంటూ మోహన్ బాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం జల్‌పల్లి లోని ఇంట్లో మంచు మనోజ్ నివాసం ఉంటుండగా మోహన్ బాబు, తిరుపతిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.

Also Read: హిందూపురంలో బాలయ్య సినిమా సీన్.. కౌన్సిలర్లతో కలిసి…!

దీనిపై కలెక్టర్ మనోజ్ కు ఇప్పటికే నోటీసులు కూడా పంపించారు. ఇక విచారణ సందర్భంగా తమవి ఆస్తి గొడవలు కాదని, తమ విద్యాసంస్థలలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు గాను ఆస్తి గొడవలుగా ప్రచారం చేస్తున్నారని, కుటుంబ సభ్యులు అంతా కూర్చుని మాట్లాడుకుందాం అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ కూడా స్పందించడం లేదని మనోజ్ తన వాదన వినిపించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్