Friday, September 12, 2025 08:50 PM
Friday, September 12, 2025 08:50 PM
roots

నా ట్విట్టర్ నేను వాడలేదు.. షర్మిల ముందు విజయసాయి సంచలన విషయాలు…!

వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఏమో గాని, ఆ తర్వాత నుంచి వస్తున్న వార్తలు సెన్సేషన్ అవుతున్నాయి. విజయ్ సాయి రెడ్డి పొలిటికల్ కెరీర్ కంటే కూడా వైఎస్ కుటుంబంతో ఆయనకున్న అనుబంధమే ఎక్కువ. అందుకే జగన్ ను ఎక్కువగా విజయసాయి రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నో విషయాల్లో విజయసాయిరెడ్డి జగన్ కు అండగా నిలిచారు. అలాంటి సాయిరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ఆ పార్టీ కార్యకర్తలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read: పవన్ డేట్స్ ఇస్తారా..? డైరెక్టర్ లో రిలీజ్ టెన్షన్స్

విజయ్ సాయి రెడ్డి పై విమర్శలు కూడా చేయలేక ఆ పార్టీ నేతలు సైలెంట్ గా ఉండిపోయారు. పార్టీ అంతర్గత పోరు కారణంగానే విజయసాయిరెడ్డి బయటకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీని వెనక వాస్తవాలు ఎలా ఉన్నా విజయసాయిరెడ్డి మాత్రం గత కొన్నాళ్లుగా ఆ పార్టీలో అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారనే అభిప్రాయం కూడా చాలా మందిలో వ్యక్తం అయింది. ఇక వైయస్ జగన్ తో విజయసాయి రెడ్డికి మంచి అనుబంధం ఉంటుంది. జగన్ ను వ్యతిరేకించారు అనే కారణంతో వైయస్ షర్మిలను తీవ్రంగా విమర్శించారు విజయసాయిరెడ్డి. అయితే ఇటీవల రాజకీయాలకు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి నేరుగా వైయస్ షర్మిలను కలవడానికి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డితో కలిసి లోటస్ పాండ్ కు వెళ్లారట.

Also Read: మంత్రులకు సీఎం భయం.. సచివాలయం వదలట్లేదు..!

లోటస్ పాండ్ లో ఆమెతో దాదాపు రెండు గంటల పాటు భేటీ అయిన విజయసాయిరెడ్డి పలు కీలక విషయాలను చర్చించారు. ఈ సమయంలోనే ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు సమాచారం. తాను కొంతమంది ఒత్తిడి కారణంగానే విమర్శలు చేశానని… తన సోషల్ మీడియా ఖాతాలు కూడా తాను కొన్నాళ్లపాటు మైంటైన్ చేయలేదని, వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచే తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారని విజయసాయిరెడ్డి షర్మిలకు వివరించారట. అలాగే విజయమ్మకు కూడా విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అనవసరంగా తనని అపార్థం చేసుకోవద్దని కొన్ని కారణాలతో తాను అప్పట్లో మీడియా ముందు కూడా మాట్లాడాల్సి వచ్చిందని, వాటికి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నానంటూ విజయసాయిరెడ్డి తెలిపినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్