Friday, September 12, 2025 05:14 PM
Friday, September 12, 2025 05:14 PM
roots

ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఏబీవీ పోస్టింగ్

వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడిన వారిలో ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావు ఒకరు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పని చేసిన ఏబీని కులం పేరుతో జగన్ సర్కార్ పక్కన పెట్టింది. అకారణంగా ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. దీంతో ఆయన న్యాయపోరాటం చేశారు. చివరికి ఐదేళ్లు పోస్టింగ్ లేకుండానే కాలం గడిపిన ఏబీ వెంకటేశ్వర్రావుకు రిటైర్‌మెంట్ చివరి రోజున తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వర్రావుకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా ఆయన సస్పెన్షన్ కాలన్నీ రద్దు చేసింది. దీంతో పూర్తిస్థాయి జీతభత్యాలు ఏబీవీకి అందనున్నాయి. ఇదే సమయంలో ఆయనకు తాజాగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : వైసీపీలో సాయిరెడ్డి రీప్లేస్‌మెంట్..!

వాస్తవానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది రాజకీయ నేతలకే ఎక్కువగా ఇస్తారు. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. ఇక ఇంఛార్జ్ డీజీపీగా పదవీ విరమణ చేసిన ద్వారకా తిరుమల రావును ఆర్టీసీ ఎండీగా పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఏబీకి కూడా అదే స్థాయి పదవి ఇవ్వాలనేది కొంతమంది నేతల మాట. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమంయలో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నాగుల్ మీరా నిర్వహించారు. అంతకు ముందు కంభంపాటి రామ్మోహన్ రావు ఈ పదవి నిర్వహించారు. ఇప్పుడు అదే పదవి ఏబీవీకి ఇచ్చారు చంద్రబాబు. జగన్ కక్షకు బలైన అధికారుల్లో ఏబీవీ ఫస్ట్ పర్సన్. ఇలాంటి అధికారికి ఇలా అప్రధాన్య పోస్ట్ ఇవ్వడం ఏమిటనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ.

Also Read : నెల్లూరులో వైసీపీని ముంచుతున్న మాజీ ఎమ్మెల్యే..!

జగన్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఏబీ వెంకటేశ్వర్రావు సెల్యూట్ చేయలేదు. ఐదేళ్ల పాటు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు ఏబీ వెంకటేశ్వర్రావు. హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో.. ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ కూడా తీర్పు ఏబీకి అనుకూలంగా రావడంతో.. ఇక చేసేది లేక రిటైర్‌మెంట్ చివరి రోజు పోస్టింగ్ ఇచ్చారు. ఇలాంటి ఏబీకి సలహాదారు పదవి వస్తుందని అంతా భావించారు. వాస్తవానికి ద్వారకా తిరుమల రావుకు జగన్ ప్రభుత్వంలో కీలక పదవులే వచ్చాయి. ఆర్టీసీ ఎండీగానే ద్వారకా తిరుమల రావు వ్యవహరించారు. అయినా సరే ఆయననే డీజీపీ చేశారు చంద్రబాబు. ఇప్పుడు మళ్లీ రిటైర్ అయ్యాక ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోనివ్వకుండా ఆయనకే ఆర్టీసీ ఎండీ పదవి ఇచ్చారు. అయితే ఎన్నో ఇబ్బందులు పడిన ఏబీ వెంకటేశ్వర్రావుకు మాత్రం ఇలా అప్రాధాన్య పోస్ట్ ఇవ్వడంపై పార్టీలో, కార్యకర్తల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అన్న మాట వాస్తవం.

Also Read : కేంద్ర బడ్జెట్లో హైలెట్స్ ఇవే.. స్టార్టప్‌లకు పండుగే

గత ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన కొందరు అధికారులు ప్రస్తుతం అత్యున్నత పోస్టుల్లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి సలహాదారుడిగా నియమితుడైన మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు కూడా గత ప్రభుత్వంలో కీలక పదవులే లభించాయి. టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన అధికారులు కూడా ప్రస్తుతం కొందరు నాయకుల అండతో కీలక స్థానాల్లో పోస్టింగ్ వేయించుకున్నారనేది పార్టీ నేతల ఆరోపణ. అయినా సరే ఏబీ వెంకటేశ్వర్రావుకు సరైన పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. దీని బదులుగా ఏబీని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, బట్టలు పెట్టి ఉంటే బాగుంటుంది కదా అని కూడా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అసలు ఏబీ వెంకటేశ్వర్రావు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి తీసుకుంటారా… లేదా అనే విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయనకు పదవి ఇచ్చి గుర్తించినందుకు సంతోషంగానే ఉన్నా.. ఆయన్ను సమర్ధంగా వినియోగించుకునే పదవి ఇవ్వలేదన్నది ప్రజల భావన.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్