Friday, September 12, 2025 08:51 PM
Friday, September 12, 2025 08:51 PM
roots

రికార్డుల దుమ్ము దులిపిన యువీ శిష్యుడు

ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా దొరికిన ప్రతి బంతిని బౌండరీ బాదాడు. ఈ సీరిస్ లో పెద్దగా రాణించని అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోయాడు. తన గురువు యువరాజ్ సింగ్ 2007 టి20 ప్రపంచ కప్ లో ఎలాగైతే ఇంగ్లాండ్ పై చెలరేగిపోయాడో అంతకుమించి విధ్వంసంతో అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 54 బంతుల్లో 135 పరుగులు చేసి మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేసిన అభిషేక్ శర్మ 7 ఫోర్లు 13 సిక్సులతో బౌలర్లతో నరకం స్పెల్లింగ్ రాయించాడు.

Also Read: గులాబీ పార్టీలో గొడవ.. కేసీఆర్ అందుకే వచ్చారా…?

ఆ బౌలర్ ఈ బౌలర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై విరుచుకుపడ్డాడు. ఇక ఈ క్రమంలో పలు రికార్డులను కూడా అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు. 37 బంతుల్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ.. పొట్టి ఫార్మాట్ లో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేయగా 37 బంతుల్లో అభిషేక్ సెంచరీ బాదాడు. ఇక కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. 45 బంతుల్లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీ చేయగా.. అభిషేక్ కేవలం 37 బంతులు మాత్రమే తీసుకున్నాడు.

Also Read: నెల్లూరులో వైసీపీని ముంచుతున్న మాజీ ఎమ్మెల్యే..!

ఇక టి20లలో భారత్ తరపున అత్యధిక సిక్సులు బాదన ఆటగాడిగా కూడా అభిషేక్ రికార్డులు క్రియేట్ చేశాడు. శ్రీలంక మీద 2017లో రోహిత్ శర్మ 10 సిక్సులు బాదగా.. 13 సిక్సులతో టాప్ ప్లేస్ లో నిలిచాడు అభిషేక్. ఇక ఈ మ్యాచ్ లో భారత్ 150 పరుగులు తేడాతో విజయం సాధించింది. 4-1 తేడాతో టి20 సీరిస్ ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా సిరీస్ ఓటమితో కసి మీద ఉన్న భారత యువ ఆటగాళ్లు ఈ సిరీస్ లో దుమ్మురేపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్