రాయలసీమ జిల్లాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి భూ అక్రమాలు తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రభుత్వ, అటవీ భూములను కబ్జా చేసారనే ఆరోపణలు వినిపించాయి. వీటిపై ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావించారు. అయితే ఇప్పటి వరకు ముందు అడుగు పడలేదు. మదనపల్లి ఫైల్స్ విషయంలో కూడా చర్యలు తీసుకోకపోవడం వివాదాస్పదం అయింది. అయితే ఇప్పుడు మరోసారి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది.
Also read : గల్లా జయదేవ్ కి రాజ్య సభ సీటు దక్కేనా?
చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్రంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. పి.సి.సి.ఎఫ్.తో మాట్లాడుతూ అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు.
Also read : నేను వస్తున్నా.. పార్టీ నేతలకు సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్
పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని ఆదేశాలు ఇచ్చారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరూ? అనే దానిపై ఆరా తీసారు. తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనేది నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు పవన్. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సత్వరమే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పి.సి.సి.ఎఫ్.ను పవన్ ఆదేశించారు.