Friday, September 12, 2025 09:13 PM
Friday, September 12, 2025 09:13 PM
roots

సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు సంచలన కామెంట్స్

ఏపీలో పథకాలు ఆలస్యం కావడం పట్ల ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. 2019-24 లో నేను ఊహించిన దానికంటే రాష్ట్రానికి ఎక్కువ డ్యామేజ్ జరిగిందన్నారు. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని… వెంటిలేటర్ పై నుంచి బయటపడేశాం కానీ పరిగెత్తించలేకున్నామన్నారు. ఇంకా పథకాలు ప్రారంభం కాలేదని కొందరు అంటున్నారన్నారు.

Also Read : భారతక్క దగ్గర కూడా గందరగోళమే..!

మూడు సార్లు ముఖ్యమంత్రి చేశా కానీ ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నాను అన్నారు. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. కొంచెం ఆలస్యం అవుతుంది, అవకాశం లేదని కేంద్రం కొంత ఆదుకోబట్టి కొంత కోలుకోగలిగామని తెలిపారు. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా రివైవల్ అయ్యేది కాదన్నారు. గత నాలుగు సంవత్సరాల ఫలితాల వల్ల ఈ ఏడాది కూడా ఆదాయం రాదన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. కంపెనీలను ఆహ్వానించడం చాలా కష్టంగా మారిపోయింది అన్నారు.

Also Read : వైసీపీలో లోఫర్లు ఎక్కువ.. జగన్ పై వసంత సంచలన కామెంట్స్

సంపద పెంచి ఆ లబ్ధి అంతా ప్రజలకే అందిస్తామని స్పష్టం చేసారు. చెప్పిన హామీలు మాత్రమే కాకుండా మెరుగైన పాలన ఇస్తామన్నారు. ప్రజలందరూ అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం 9.75 కోట్ల అప్పులు ఉన్నాయని డబ్బులు చెల్లించకపోవడం తో అప్పులిచ్చిన వాళ్ళు కొందరు కోర్టులకు వెళ్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ డిఫాల్ట్ అయిందని అనౌన్స్ చేస్తున్నారని దానివల్ల క్రెడిట్ రేటింగ్ పోతోందన్నారు. ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది, అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే అభివృద్ధి పనులు సరిగా చేయలేమన్నారు. ఇదే కొనసాగితే చివరికి బాధపడేది ప్రజలే. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్