Tuesday, October 28, 2025 07:29 AM
Tuesday, October 28, 2025 07:29 AM
roots

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 7వ తరగతి బాలిక చిచ్చు

ఈ రోజుల్లో విద్య ఖరీదు అయిన అంశం కావడంతో చాలా మంది ఉన్నత చదువులు అంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసిన ఓ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఐఏఎస్ అధికారిణి కావాలనే తన కలను నెరవేర్చుకునేందుకు గానూ తనకు ఆర్థిక సహాయం అందించాలని 7వ తరగతి చదువుతున్న బాలిక చేసిన విజ్ఞప్తి ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వివాదంగా మారింది. పంఖూరి త్రిపాఠి అనే బాలిక.. తన చదువు కోసం సిఎం యోగి ఆదిత్య నాథ్ కు విజ్ఞప్తి చేసింది.

Also Read : కరేడు రైతుల పోరాటంలో వైసీపీ ఎటువైపు..!

ఆమె తండ్రి రాజీవ్ కుమార్ త్రిపాఠి ఒక ప్రమాదంలో గాయపడగా.. కాలికి తీవ్ర గాయం అయింది. ఆ తర్వాత ఉద్యోగం మానేయాల్సి రావడంతో ఆమె కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనితో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయం కోరింది ఆ చిన్నారి. స్పందించిన సిఎం, ఆమె చదువుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని హామీ ఇచ్చారు. 7వ తరగతి చదువుతున్న ఆ చిన్నారి, తన స్కూల్ ఫీజు మాఫీ చేయడానికి స్కూల్ అంగీకరించలేదు అని తెలిపింది. ఈ విషయాన్ని జూలై 1న జనతా దర్బార్‌కు వెళ్లి సిఎం దృష్టికి తీసుకువెళ్ళింది.

Also Read : వాయు కాలుష్యంతో గుండెపోటు.. శాస్త్రవేత్తల వార్నింగ్

సిఎం సొంత నియోజకవర్గం అయిన గోరక్ పూర్ లో బాలిక చదువుకు ప్రభుత్వం సహకరించడం లేదని.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఆ బాలికను తాను చదివిస్తానని ముందుకు రావడంతో ఇది రాజకీయ దుమారం రేగింది. పంఖూరి త్రిపాఠి గోరఖ్‌పూర్‌లోని పక్కీబాగ్‌లోని సరస్వతి శిశు మందిర్‌లో చదువుతోంది. సిఎం స్వయంగా ఆమెకు హామీ ఇవ్వడంతో.. ఫీజు కట్టేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆమె కుటుంబం భావిస్తోంది. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అనేది కేవలం ప్రచారం మాత్రమే అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్