Friday, September 12, 2025 07:33 PM
Friday, September 12, 2025 07:33 PM
roots

అయ్యర్ పై యువరాజ్ తండ్రి సంచలన కామెంట్స్

ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఐపిఎల్ లీగ్ దశలో దుమ్ము రేపిన రెండు జట్లు ఫైనల్ కు దూసుకు వెళ్ళాయి. ఫైనల్ లో మెజారిటీ అనలిస్ట్ లు.. పంజాబ్ గెలుస్తుందని భావించారు. బౌలింగ్ విభాగంలో పంజాబ్ బలంగా కనపడటం, ఆర్సీబీని తక్కువ పరుగులకే కట్టడి చేయడం జరిగాయి. దీనితో పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ చూసిన అభిమానులు.. ఆర్సీబీ ఈసారి కూడా కప్ గెలవడం కష్టమనే భావించారు. కాని బౌలింగ్ లో ఆర్సీబీ అంచనాలకు మించి రాణించింది.

Also Read : క్రికెట్ ప్రపంచం గుర్తించని హీరో.. శశాంక్ సింగ్

శ్రేయాస్ అయ్యర్, స్టోయినిస్, ప్రబ్ సిమ్రాన్ సింగ్ వంటి ఆటగాళ్ళు కీలక సమయంలో అవుట్ కావడం, నేహాల్ వధేరా చేతులు ఎత్తేయడంతో పంజాబ్ ఫెయిల్ అయింది. కీలక సమయంలో అయ్యర్ వికెట్.. పంజాబ్ విజయంపై ప్రభావం చూపించింది. రొమారియో బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయ్యర్. అక్కడి నుంచే మ్యాచ్ ఆర్సీబీ వైపు మళ్ళింది. పంజాబ్ మ్యాచ్ గెలిచే అవకాశాలకు అతని వికెట్ చాలా కీలకం. క్వాలిఫయర్ 2 లో పంజాబ్ గెలవడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు.

Also Read : సినిమా పరిశ్రమ దారిలోకి వచ్చిందా..?

శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61*) మాత్రమే ఫైనల్ లో పంజాబ్ తరుపున కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీనిపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. నా అభిప్రాయం ప్రకారం, శ్రేయాస్ అయ్యర్ ఆడిన షాట్ క్రిమినల్ నేరం కిందకు వస్తుంది అంటూ మండిపడ్డారు. అశోక్ మన్కడ్ ఈ క్రిమినల్ నేరం గురించి నాకు చెప్పాడు.. ఇది సెక్షన్ 302 కింద వస్తుంది అంటూ సంచలన కామెంట్స్ చేసారు. దీని పర్యవసానంగా అతనిని రెండు మ్యాచ్‌ల పాటు నిషేధించాల్సి వస్తుందని కూడా చెప్పాడని మండిపడ్డారు యోగరాజ్ సింగ్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్