Friday, September 12, 2025 05:12 PM
Friday, September 12, 2025 05:12 PM
roots

సాయిరెడ్డితో వైసీపీ రాజీ కష్టాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారం ఎప్పుడు ఏమలుపు తిరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ వ్యవహారంలో వైసిపి కీలక నేతలను అరెస్టు చేసే అవకాశం ఉందనే సంకేతాలు కూడా ఈ మధ్య కనబడుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఏం మాట్లాడతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. విచారణలో ఆయన ఎవరి పేరు చెప్తారు అనేదానిపై అటు అధికారులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయసాయిరెడ్డి విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం కాస్త దూకుడుగానే వ్యవహరిస్తోంది.

Also Read : జగన్‌కు ఈడీ బిగ్ షాక్..!

వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి మద్యం పాలసీకి సంబంధించి అప్పట్లో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడమే కాకుండా స్వయంగా కుంభకోణంలో కీలకపాత్ర పోషించారు అనేది ప్రధాన ఆరోపణ. ఇక ఆయనను నేడు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. దర్యాప్తు కోసం విజయసాయిరెడ్డి గురువారం సాయంత్రం విజయవాడ చేరుకున్నారు. ఒకరోజు ముందుగానే ఆయన విజయవాడలోనే ఒక ప్రముఖ హోటల్కు చేరుకుని అక్కడ కొంతమంది నేతలతో సమావేశం అయ్యారు.

Also Read : బీ కేర్ ఫుల్.. పవన్‌కు రోజా వార్నింగ్..!

రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది కీలక నేతలు విజయసాయిరెడ్డి తో భేటీ అయినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి సంబంధించి అధికారులకు కూడా స్పష్టమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో సదరు హోటల్ యాజమాన్యాన్ని సీసీటీవీ ఫుటేజ్ కూడా దర్యాప్తు బృందం అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విజయసాయిరెడ్డి తో రాజీ కోసం కొంతమంది కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం నుంచి విజయసాయికి రాయబారం వెళ్ళినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ నేత రాయబారి విజయసాయిరెడ్డి తో దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారట. దీనిపైనే దర్యాప్తు అధికారులు కూడా ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్