అధికారంలో ఉన్నప్పుడు హద్దులు దాటి మాట్లాడారు. నోటికి ఏమాట వస్తే అంతా అన్నారు. చివరికి కుటుంబ సభ్యులను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. వయస్సు కూడా తెలియకుండా నీచమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు అయితే రాయాలంటేనే సిగ్గుపడేలా వైసీపీ నేతలు వ్యవహరించారు. నాడు జగన్ మెప్పు కోసం ఈ తరహా వ్యాఖ్యలు చేసిన నేతలంతా ఇప్పుడు అందుకు ఫలితం అనుభవిస్తున్నారు. హద్దులు దాటి ప్రవర్తించిన ఒక్కొక్కరి పని పడుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పోసాని కృష్ణమురళీని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంట్లో పోసానిని అదుపులోకి తీసుకున్న అన్నమయ్య జిల్లా పోలీసులు… ఏపీకి తరలించారు.
Also Read : బీఆర్ఎస్ కు నిద్ర లేకుండా చేస్తున్న రేవంత్ టూర్
అయితే పోసాని అరెస్టు తర్వాత వైసీపీ నేతలు సోషల్ మీడియాలో గగ్గొలు పెడుతున్నారు. రాజకీయాలతో ఇక సంబంధం లేదని చెప్పినా… సారీ చెప్పినా సరే పోసానికి కూటమి ప్రభుత్వం వదలిపెట్టలేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఆరోగ్యం బాగలేదని చెప్పినా సరే… సరిగ్గా పండుగ రోజు రాత్రి పూట అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందని.. ఇందుకు తగిన మూల్యం చెల్లించు కోవడం ఖాయమని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు అయితే స్టాండ్ విత్ పోసాని అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా స్వయంగా పోసాని భార్యకు ఫోన్ చేసి.. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు.
Also Read : పండుగనాడు కూడా ప్రాంతీయ విద్వేషమేనా కవితక్కా..?
అయితే వైసీపీ నేతలకు టీడీపీ, జనసేన నేతలు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. సారీ చెప్పి రాజకీయాలకు దూరం అంటే సరిపోతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌పై పోసాని చేసిన వ్యాఖ్యల వీడియోలను బయటకు తీస్తున్నారు. మీ ఇంట్లో వాళ్లని కూడా ఇలా తిట్టి సారీ చెబితే సరిపోతుందా అని నిలదీస్తున్నారు. అలా అయితే మీ కుటుంబ సభ్యులను కూడా మేము తిట్టి సారీ చెబుతామంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొందరైతే పోసాని గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను ఇప్పుడు బయట పెడుతున్నారు. చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో పోసాని విచిత్ర వ్యాఖ్యలు చేశారు. “అవినీతి పనులు చేశాడు కదా. అందుకే జైల్లో పెట్టారు.. ఓ ఏడాదో ఏడాదిన్నరో హాయిగా ఉండు.. బయటకు వచ్చిన తర్వాత నిజాయతీగా ఉండు..” అంటూ వెటకారంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే వీడియో బయటపెట్టిన టీడీపీ, జనసేన అభిమానులు… “నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశావు కదా.. ఏడాదో, ఏడాదిన్నరో జైల్లో హాయిగా ఉండు. బయటకు వచ్చిన తర్వాత నోటికి అదుపులో పెట్టుకుని బతుకు” అంటూ పోస్టులు పెడుతున్నారు.
మళ్ళా ఇలాంటోళ్ళు ఇక పుట్టకుండా గట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే