గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసినప్పటి నుంచి.. వైసీపీ అధిష్టానం కాస్త హడావిడి చేస్తుంది. కారణమేంటో తెలియదు కానీ వైసీపీ నేతలను పదేపదే విజయవాడ జైలుకు పంపిస్తోంది అధిష్టానం. ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని కూడా విజయవాడ జైలుకు వెళ్లొచ్చారు. అంతకుముందే వైయస్ జగన్, కొడాలి నాని వంటి వాళ్ళు విజయవాడ జైలు వద్ద సందడి చేశారు. ఇక మంగళవారం కూడా కృష్ణా జిల్లా నేతలు వల్లభనేని వంశీ వద్దకు వెళ్లాలని జగన్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : సభలో 11 నిమిషాలు… చివరికి బాయ్‌కాట్..!
అయితే దీని వెనుక కారణం ఏంటి అనే దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. సాధారణంగా ఎవరైనా అరెస్టు అయితే జగన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. గతంలో నందిగం సురేష్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు అరెస్టు అయినప్పుడు పెద్దగా వైసీపీ నేతలు ఎవరు రియాక్ట్ అవలేదు. కానీ వంశీ విషయంలో మాత్రం కాస్త ఇది డిఫరెంట్ గా కనబడుతోంది. అయితే దీని వెనక ఏదైనా వ్యూహం ఉండవచ్చు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల అనుమానం.
Also Read : కోహ్లీ సెంచరీ అడ్డుకునే కుట్ర జరిగిందా…?
కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కావాలనే ఇస్తున్నారా అనేది గట్టిగా వినపడుతోంది. వంశీ ని బయటకు తీసుకురావడానికి కూడా జగన్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా కనపడకపోవడంతో ఆయన ఆ విషయాన్ని పక్కన పెట్టి జైలు వద్దకు పార్టీ నేతలను పదే పదే పంపిస్తున్నారు. జగన్ మనస్తత్వానికి ఈ చర్యలు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పేర్ని నాని జిల్లా జైలు వద్ద చేసిన వ్యాఖ్యలు కూడా కాస్త సంచలనం అయ్యాయి.
Also Read : గెలిపించుకుని రండి.. మంత్రులకు చంద్రబాబు టార్గెట్
అయితే వంశీ ఏదైనా విషయాలను బయట పెడతారు అనే భయమా.. లేదంటే ఆయనపై థర్డ్ డిగ్రీ జరుగుతుందనే ఆందోళనా అర్థం కావడం లేదనేది రాజకీయ వర్గాల మాట. వంశి అరెస్టు కోసం టిడిపి నేతలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఆయన చేసిన చేష్టలు చూసిన టిడిపి నేతలు ఆయనను కచ్చితంగా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇక వంశీని లోపల వేయడంతో టిడిపి క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. మరి వైసీపీ ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటనేది చూడాలి.