ఏదేమైనా సరే చేసిన తప్పుని కవర్ చేసుకోవడంలో వైసీపీ అధిష్టానం దిట్ట. అబద్దం చెప్పినా అది నిజం అని నమ్మించడానికి వైసీపీ నేతలు చాలా కష్టపడుతూ ఉంటారు. ఒకరి తర్వాత మరొకరు మీడియా సమావేశాలు నిర్వహించి… పదే పదే చెప్పిన దాన్నే చెప్తూ తాము పున్యాత్ములం అనే కవరింగ్ గట్టిగానే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా అరెస్ట్ ల విషయంలో కూడా దాదాపుగా అదే జరుగుతోంది. హత్యలు చేసిన వారిని ఏ విధంగా వెనకేసుకు వస్తున్నారో… సోషల్ మీడియాలో బూతులు మాట్లాడిన వాళ్ళను కూడా అదే రేంజ్ లో వెనకేసుకు వస్తున్నారు.
Also Read : రెడ్ అలెర్ట్: అంతా కల్తీ మయం… టేస్ట్ లో వరస్ట్..!
పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళా కార్యకర్త విషయంలో… మాజీ మహిళా మంత్రులు ఆర్కే రోజా, విడదల రజనీ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఆమెను అరెస్ట్ చేసి… అక్రమంగా బంధించి, భర్తతో ఉన్నా సరే ఇబ్బందులకు గురి చేసారని చెప్పే ప్రయత్నం చేసారు. సుధారాణి మాట్లాడిన మాటలు… ఆమె మహిళ అనే విషయం మర్చిపోయి వాడిన పదాలు… ఆమె చూపించిన కుల అహంకారం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అరెస్ట్ చేసింది వాటి గురించి అయితే… ప్రజా సమస్యలు అని మాట్లాడటం మొదలుపెట్టారు.
Also Read : జగన్ కి, చంద్రబాబు కి ఇంత తేడానా.. ఆశ్చర్యపోయిన మాజీ మంత్రి
కళ్ళం హరికృష్ణా రెడ్డి, ఇంటూరి రవి కిరణ్, వర్రా రవీంద్రా రెడ్డి మాట్లాడిన మాటలు, చేసిన పోస్ట్ లు అందరికి గుర్తున్నాయి. వారిని అరెస్ట్ చేసింది ప్రజా సమస్యల గురించి మాట్లాడినందుకు కాదూ… వారు చేసిన అభ్యంతరకర పోస్ట్ ల గురించి అని పదే పదే పోలీసులు కూడా చెప్పారు. అయినా సరే వారి గొంతు నొక్కుతున్నారు అంటూ వైసీపీ నేతలు మాట్లాడే ప్రయత్నం చేసారు. బూతులు మాట్లాడుతుంటే నొక్కారు గాని ప్రజా సమస్యల గురించి కాదు కదా…? ప్రజా సమస్యల గురించి వైసీపీ సోషల్ మీడియాలో వేలాది మంది పోస్ట్ చేస్తున్నా… కేవలం 45 మందిని మాత్రమే కదా గుర్తించింది…? ఏదేమైనా… తమను తాము రక్షించుకోవడానికి ఎదురు దాడి అనే మంత్రాన్ని వైసీపీ జపించడం మాత్రం ఆశ్చర్యకరమే.




