Friday, September 12, 2025 10:58 AM
Friday, September 12, 2025 10:58 AM
roots

పులివెందుల సిత్రాలు.. మళ్లీ అదే ప్రయత్నం..!

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ, వైసీపీ నేతలు స్థాయికి మించి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి జెడ్పీటీసీ పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉంది. కానీ ఈ ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే లక్ష్యంతోనే ప్రచారం నిర్వహించాయి కూడా. అటు అభ్యర్థుల ఎంపిక మొదలు.. పోలింగ్ రోజు వరకు హోరా హోరీగా సాగింది.

Also Read : కూలీ టికెట్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్…!

పోలింగ్ రోజు ఉదయం నుంచే పులివెందుల మండలంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందనే చెప్పాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రతి బూత్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిజానికి ఉప ఎన్నిక అనటం కంటే కూడా.. సాధారణ పోలింగ్ జరుగుతుందేమో అనేలా ఇక్కడ వాతావరణ పరిస్థితి నెలకొంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో స్థానికులు ఓట్లు వేసే అవకాశం వచ్చింది. వాస్తవానికి 25 ఏళ్లుగా పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అవుతోంది. వైఎస్ కుటుంబ పెత్తనానికి భయపడి ఇక్కడ ఇతర పార్టీలు పోటీ చేయడం లేదనే మాట వినిపిస్తోంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి మారిపోయింది.

అయితే ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నాలు చేశారు. ఎన్నిక ముందు రోజు రాత్రి ఓటర్లకు చీరలు, డబ్బులు పంచుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక తెల్లవారుజాము నుంచే ఓటర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల అండతో పోలింగ్ సజావుగా కొనసాగింది. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం ఇలా ప్రవర్తిస్తారా అనే వైసీపీపై నెగిటివ్ ప్రచారం మొదలైంది. దీనిని కవర్ చేసుకునేందుకు వైసీపీ సోషల్ మీడియా టీమ్ రంగంలోకి దిగింది.

Also Read : లిక్కర్ లో ఇరుక్కున్న మరో ఐపిఎస్.. చార్జ్ షీట్ లో సంచలనాలు

కొందరు యువకులు.. బైక్ వెళుతూ మా ఓటు స్లిప్పులను టీడీపీ నేతలు లాక్కుని తరిమేశారని.. మాకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తున్న వీడియో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో, సాక్షి మీడియాలో బాగా వినిపిస్తోంది. అయితే ఈ వీడియోలో బైక్ పైన ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో వెనకున్న వ్యక్తి ల్యాప్ టాప్ బ్యాగ్ తగిలించుకుని ఉన్నాడు. వాస్తవానికి ఉదయమే సొంత ఊర్లో ఓటు వేయడానికి వచ్చే వాళ్లు బ్యాగ్ తగిలించుకుని రారు. అనుమానంతో మీది ఏ ఊరు అని స్థానికులు ప్రశ్నించడంతో చెరో ఊరి పేరు చెప్పి.. అక్కడి నుంచి పారిపోయారు. దీనినే టీడీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. సజ్జల సార్ సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదనుకుంటా.. అందుకే ఇలా చెరో ఊరి పేరు చెప్పారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్