Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

అమరావతి ముంపు కోసం ఎదురుచూస్తున్న గుంటనక్కలు

భారీ వర్షాలకు ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు వంటి నగరాలు జలమయం అయినప్పుడు, ఇంకా నిర్మాణ పనులు పునః ప్రారంభం కానీ అమరావతి రాజధాని ప్రాంతం జలమయం కాదా?.. అంటే కాకూడదనే వాదిస్తున్నాయి వైసీపి సోషల్ మీడియా గ్యాంగులు. భారీ వర్షాల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పంటలు నీట మునిగి రైతులు నష్టపోతున్నారనే బాధ వారిలో ఏ కోశానా కనబడదు. అమరావతి నీట మునగాలని, మునగబోతుందనే శాడిస్ట్ సంతోషమే కనిపిస్తుంటుంది.

శాడిజం ఓ వ్యక్తిలో ఉండటం ఆశ్చర్యం కలిగించదు. కానీ ఆ పార్టీలో అందరికీ, ఆ పార్టీని అభిమానించే అందరికీ ఈ శాడిజం వ్యాపించడమే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే, అమరావతి మునిగిపోయిందని చంకలు గుద్దుకుంటున్నవారు కూడా రాష్ట్ర ప్రజలే. కానీ వారికి రాష్ట్రం పట్ల, సాటి ప్రజల పట్ల ఎటువంటి అభిమానం, సానుభూతి లేకపోవడాన్ని ఏమనుకోవాలి? రాష్ట్ర ప్రజలందరూ గర్వించాల్సిన అమరావతిని జగన్‌ పాడుబెట్టి నాశనం చేస్తున్నప్పుడు ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు… తప్పు పట్టలేదు.

Read Also : భాద్యత మర్చిపోతే మంత్రులైనా, అధికారులైనా ఒక్కటే.. బాబు హెచ్చరిక

దాని వలన రాష్ట్రానికి వేలు లక్షల కోట్లు నష్టం వాటిల్లుతోందని తెలిసినా ఎవరూ తప్పు పట్టలేదు. అమరావతిని కాదని మూడు రాజధానులు, విశాఖ రాజధాని అని జగన్‌ 5 ఏళ్ళు కాలక్షేపం చేసేసినా వైసీపిని అభిమానించేవారికి తప్పుగా అనిపించలేదు. పచ్చటి ఋషికొండని ధ్వంసం చేసి దానిపై రూ.500 కోట్లతో ప్యాలస్‌ నిర్మించుకున్నా ఎవరికీ తప్పుగా అనిపించలేదు. రాజధాని లేని రాష్ట్రమని అందరూ అవహేళన చేస్తున్నా సిగ్గనిపించలేదు. కానీ కనీసం డ్రైనేజి కాలువలు కూడా నిర్మించని అమరావతిలో నీళ్ళు చేరితే మన రాజధాని మునిగిపోయిందని సోషల్ మీడియాలో వైసీపి మద్దతుదారులు చంకలు గుద్దుకోవడం శాడిజం కాక మారేమిటి?

అదే…గత 5 ఏళ్ళలో జగన్‌ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణ పనులు కొనసాగిస్తూ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి ఉంటే అక్కడ ఒక్క చుక్క నీళ్ళు నిలబడి ఉండేవా? జగన్‌ నిర్లక్ష్యం కారణంగా అమరావతిలో పలు భారీ భవనాల పునాదులు గత 5 ఏళ్ళుగా నీళ్ళలో మునిగి ఉన్నాయి. వాటి దగ్గరకు చేరుకునేందుకు నిపుణుల బృందం బోట్లు వేసుకొని వెళ్ళి పరిశీలిస్తున్నప్పుడు వైసీపికి వంతపాడుతున్న ఎవరికీ సిగ్గనిపించలేదా? జగన్‌కి చాతకాని పని అమరావతిని సిఎం చంద్రబాబు నాయుడు ఎలాగూ నిర్మించి చూపుతారు. కనుక ఓ 5 ఏళ్ళు ఓపిక పడితే చాలు. అప్పుడు భారీ వర్షాలు కురిసినప్పుడు రాజధాని అమరావతిలో ఉండటం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడవచ్చు. అప్పుడు జగన్‌తో సహా వైసీపి నేతలందరూ అమరావతిలోనే ప్యాలస్‌లు కట్టుకున్నా ఆశ్చర్యం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్