Monday, October 27, 2025 10:44 PM
Monday, October 27, 2025 10:44 PM
roots

ముందు సోషల్ మీడియా.. తర్వాతే ఉద్యమాలు…!

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా… అసలు ఆ పార్టీ రాజకీయంగా మనుగడ కొనసాగిస్తున్నా… సోషల్ మీడియా పుణ్యమే. రాజకీయాల్లో వైసిపి గురించి చర్చ జరుగుతుందంటే సోషల్ మీడియా కారణంగానే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే 2024 లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది. 2019 నుంచి 2024 వరకు చెలరేగిపోయిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు.. ఆ తర్వాత అసలు మాట్లాడే ప్రయత్నం కూడా ఎక్కడా చేయటం లేదు.

Also Read : రికార్డ్ పేరుతో బిల్డప్పులు.. ఎవరి కోసం..?

ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి కేసులు నమోదు చేయడం, జైలుకు తరలించడంతో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు వైసీపీ కార్యకర్తలు. అయితే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కేడర్ ను మళ్లీ నిద్ర లేపాలని వాళ్లకు ధైర్యం ఇవ్వాలని వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారు. సోషల్ మీడియా బలోపేతం కాకపోతే తాను ఏం చేసినా సరే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండదు అనే భావనలోనే జగన్ ఉన్నారు. అందుకే పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా… వాటి విషయంలో జగన్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

Also Read : పింఛన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..!

సోషల్ మీడియాను బలోపేతం చేసిన తర్వాతే, సోషల్ మీడియా కార్యకర్తలను కంప్లీట్ గా రంగంలోకి దించిన తర్వాతనే ఏదైనా నిరసన కార్యక్రమాలు చేయాలని జగన్ నేతల వద్ద చెప్తున్నట్లు సమాచారం. జిల్లాల్లో సోషల్ మీడియా చాలా బలహీన పడిందని, త్వరలోనే సోషల్ మీడియా విషయంలో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఫోకస్ పెట్టి వర్క్ చేయాలని జగన్ సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో మాదిరిగా సోషల్ మీడియా నుంచి స్పందన ఉండటం లేదని, కాబట్టి పార్టీ నేతలు అందరూ దీనిపై దృష్టి పెట్టాలని జగన్ కోరుతున్నారు.

Also Read : వైసీపీకి చావు దెబ్బ.. బాలినేని రివేంజ్ మోడ్..?

ఇప్పటికే పలువురు సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ స్వయంగా మాట్లాడుతున్నారు. ఇక త్వరలోనే తాడేపల్లి లో కూడా ఆ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఆఫీసు కూడా ఓపెన్ చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భయపడుతున్న కార్యకర్తలకు ధైర్యం కల్పించే విధంగా జగన్ చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్