Tuesday, October 28, 2025 07:27 AM
Tuesday, October 28, 2025 07:27 AM
roots

ఒంగోలులో ఖాళీ అయిపోతున్న వైసీపీ

అధికారం కోల్పోయి ఓ వైపు ఇబ్బందులు పడుతున్న వైసీపీ.. ఒకప్పుడు పట్టున్న ప్రాంతాల్లో క్రమంగా బలహీనపడుతోంది. కీలక ప్రాంతాల్లో నాయకులు ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతోంది. బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీ మారిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఇప్పటికే ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ ను కోల్పోయిన ఆ పార్టీకి గ్రామ స్థాయి నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

Also Read : గ్రూప్ -2… తప్పు ఎవరిదీ..?

తాజాగా బాలినేని ఆ పార్టీకి గట్టి దెబ్బ కొట్టారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో 20 మంది వైసీపీ కార్పొరేటర్లు, ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు జనసేనలో జాయిన్ అవుతున్నారు. గత కొద్దికాలంగా జనసేనలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు ప్రయత్నం చేస్తున్నారు. అయితే పలు కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవటంతో పలుసార్లు వాయిదా పడింది.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వీళ్ళే..?

గతంలో మాజీమంత్రి బాలినేని వైసీపీలో ఉన్న సమయంలో ఆయన ఆశీస్సులతో కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచిన పలువురు వైసీపీ నేతలు.. ఇప్పుడు బాలినేని జనసేనలో చేరడంతో ఆయన వెంట నడిచేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ ను తమ చేతుల్లోకి తీసుకుంది టీడీపీ. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పలువురు వైసీపీ కార్పొరేటర్లను పార్టీలోకి తీసుకోవడంతో మున్సిపల్ కార్పోరేషన్ టీడీపీ వశం అయింది. తాజాగా 23 మంది సభ్యులు జనసేనలో చేరితే ఒంగోలు కార్పొరేషన్ రాజకీయం మారడం ఖాయంగా కనపడుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్