ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఈ కేసులో పలువురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత పలువురు నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా సరే నిరాశ ఎదురయింది. అటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా విచారణ మొదలు పెట్టడంతో నిందితులకు బెయిల్ రావడం కష్టమే అని భావించారు. ముఖ్యంగా రాజ్ కేసిరెడ్డిని ఈడి అదుపులోకి తీసుకుంటుందని వార్తలు వచ్చాయి.
Also Read : తిరుమల బ్రహ్మోత్సవాలు.. మళ్లీ మళ్లీ విమర్శలు..!
అయితే తాజాగా ఈ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది కోర్ట్. తాజాగా ఏసీబీ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఇటీవల మిధున్ రెడ్డి మద్యంతర బెయిల్ తీసుకుని పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరయ్యారు. ఇక మిగిలిన నిందితులకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కేసులో దాదాపుగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఇక త్వరలోనే రాజ్ కేసిరెడ్డిని కూడా బెయిల్ పై విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి.
Also Read : మిడిల్ ఆర్డర్ లో తెలుగు ఛాంపియన్.. తిలక్ సూపర్ హిట్
ఇదే కేసులో కీలకంగా భావిస్తున్న మరో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు. ఇది ఇలా ఉంచితే ఈ కేసును సిబిఐ విచారించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న నిందితులను తీసుకొచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతోంది సిట్. విదేశాలకు నగదు తరలించే విషయంలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది వ్యక్తులను ఎలాగైనా సరే దేశం తీసుకొచ్చి విచారించాలని భావిస్తున్నారు. వారిలో ఎక్కువమంది రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకే పని చేసినట్లు గుర్తించారు. వారిని తీసుకురావాలి అంటే సిబిఐతోనే సాధ్యపడుతుందని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు సమాచారం.