వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతోంది. 11 సీట్లు మాత్రమే వచ్చాయనే విషయాన్ని మర్చిపోయిన వైసీపీ నేతలు.. ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయని గొప్పగా చెబుతున్నారు. అదే పెద్ద అచీవ్‌మెంట్‌గా చూపించి ప్రతిపక్ష హోదా కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటే తగినన్ని సీట్లు రావాలనే విషయాన్ని మరుగున పెడుతున్నారు వైసీపీ నేతలు. అయితే పార్టీ ఓడిన తర్వాత జగన్ ఒంటెద్దు పొకడలకు పలువురు నేతలు, సన్నిహితులు ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మాజీ మంత్రులతో పాటు సిట్టింగ్ ప్రజాప్రతినిధులు సైతం బై బై జగన్ అనేస్తున్నారు. తాజాగా మరో ఎమ్మెల్సీ జగన్ పార్టీకి దూరంగా వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు.
Also Read : వంశీ అరెస్ట్ పై పోలీసులు సంచలన కామెంట్స్
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానిదే పెద్ద ఓటు బ్యాంక్. కోనసీమ జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గానికి కీలక నేతల్లో ఒకరు తోట త్రిమూర్తులు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. నాటి నుంచి టీడీపీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితీ సమీకరణాల్లో భాగంగా 1994లో తోట త్రిమూర్తులుకు టీడీపీ టికెట్ రాకపోవడంతో… స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1995లో చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టారు. 1999లో మరోసారి రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తోట త్రిమూర్తులు. ఆ తర్వాత 2014లో మండపేట నియోజకవర్గం నుంచి మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన త్రిమూర్తులు… తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. ఇక 2019లో ఓడిన తర్వాత జగన్‌కు జై కొట్టిన త్రిమూర్తులు… ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
Also Read : జీవీ రెడ్డికి అధిష్ఠానం పిలుపు.. పదవి ఖాయమా..?
వైసీపీలో కీలక కాపు నేతగా గుర్తింపు తెచ్చుకున్న తోట త్రిమూర్తులు.. ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం, ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీలలో కీలక నేతగా కొనసాగిన తోట త్రిమూర్తులు త్వరలో జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా తోట త్రిమూర్తులుకు మంచి గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని కాపు నేతలు త్రిమూర్తులుతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. తాజాగా తోట త్రిమూర్తులు జనసేన నేతతో కలిసి ద్రాక్షారామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత సామినేని ఉదయభానుతో కలిసి ద్రాక్షారామం ఆలయాన్ని త్రిమూర్తులు సందర్శించారు. ఓ వైపు జగన్‌పై జనసేన నేతలు విమర్శలు చేస్తుంటే… ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మాత్రం జనసేన నేతలతో కలిసి తిరగడం పట్ల ఆ పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే త్రిమూర్తులు జనసేనలో చేరుతారని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఇలాంటి వారికి పదవులు ఎలా ఇచ్చారని జగన్‌పై విమర్శలు కూడా చేస్తున్నారు.