Sunday, March 22, 2026 03:31 AM
Sunday, March 22, 2026 03:31 AM

పారిపోలా… దాక్కున్నారంతే..! అన్న ఆదేశిస్తే వచ్చేస్తారు..!

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కోసం గాలిస్తున్న పోలీసులు… హైదరాబాద్ లో గాలించిన పోలీసులు… గన్నవరంలో బంధువుల ఇంట్లో ఉన్న వంశీని అరెస్ట్ చేసే అవకాశం… చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ కోసం వెతుకుతున్న పోలీసులు… టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ కోసం గాలిస్తున్న పోలీసులు… ఈ వార్తలు అన్నీ మనం చదువుతూనే ఉన్నాం కదా మూడు నెలల నుంచి. అయితే వాళ్ళు దొరకడం లేదు కదా…?

కానీ… ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో వైసీపీ అధినేత సమావేశం… పార్టీ పరిస్థితిపై చర్చ అనే వార్త ఒకటి వస్తుంది. ఆ తర్వాత వీళ్ళు అందరూ మీడియా ముందు ప్రత్యక్షం అవుతారు. జగన్ తో ఆ నేత సమావేశం, ఈ నేత సమావేశం అనే వార్తలు హల్చల్ చేస్తాయి. అది చూసి పోలీసులు షాక్ అవుతారో లేదో గాని టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం షాక్ అవుతారు. పోలీసులకు దొరకని వాళ్ళు జగన్ కు ఎలా దొరుకుతున్నారు అని… దేశం వదిలేసారని కొందరు అసలు రాష్ట్రంలోనే లేరని కొందరు ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు.

Also Read : సిఐడి మాజీ డిజి పివి సునీల్ కుమార్ అరెస్ట్ కి రంగం సిద్ధం..!

కాని తీరా చూస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్లరు, జస్ట్ దాక్కుంటారు అంతే. ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న సమయంలో కూడా ఏపీ పోలీసులు వారిని పట్టుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. సైబర్ నేరగాళ్ళ కోసం తెలంగాణా పోలీసులు ఉత్తరాది రాష్ట్రాల్లో గాలించి పదుల సంఖ్యలో అరెస్ట్ లు చేస్తున్నారు. అలాంటి సమయంలో కూడా ఏపీ పోలీసులకు మాజీ ప్రజా ప్రతినిధులు దొరకకపోవడం విడ్డూరంగా ఉంది. మరి వాళ్ళే దొరకలేదో.. వీళ్ళే పట్టుకోలేదో గాని, పోలీసుల కంటే జగన్ పవర్ ఫుల్ వారి విషయంలో అని ప్రూవ్ అయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్