ఆడలేక మద్దెల ఓడు అన్నాడట… వెనకటికి ఒకడు.. అలా ఉంది వైసీపీ నేతల తీరు. ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఘోరంగా ఓడిపోయింది వైసీపీ. అయితే ఈ విషయం ఒప్పుకునేందుకు వైసీపీ నేతలకు ధైర్యం లేదు. అందుకే ఈవీఎం గోల్‌మాల్ అంటూ నంగనాచి కబుర్లు అన్నీ చెప్పారు. అందుకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 164 సీట్లు వచ్చాయని గగ్గోలు పెడుతున్నారు. మరి అదే సమయంలో 2019లో వైసీపీకి 151 సీట్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తే మాత్రం… అదంతా తమ నేతను చూసి వచ్చిన ఓట్లంటున్నారు. అది నిజమంట… ఇది గోల్‌మాల్ అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను రుజువు చేయమని ఎవరైనా సవాల్ చేస్తే మాత్రం.. సైలెంట్ అయిపోతారు.
Also Read : రౌడీషీటర్ కు రాచమర్యాదలా.. సిగ్గు సిగ్గు..!
ఇప్పటి వరకు తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు… ఇప్పుడు మరోసారి తోక ముడిచారు. ఈవీఎం గోల్‌మాల్ కారణంగా గెలిచినట్లు గగ్గోలు పెట్టిన వైసీపీ… బ్యాలెట్ ఓటింగ్‌కు దూరంగా నిలిచింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు వైసీపీ ప్రకటించింది. పోలీసులంతా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని… కాబట్టి ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదని ఆరోపిస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు.
Also Read : జగన్ రెడ్డి.. ఇదేందయ్యా ఇదీ…?
ఇప్పుడు ఇదే అంశం వైసీపీ నేతలకు బూమ్‌రాంగ్ అయ్యింది. వాస్తవానికి గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో కూడా టీడీపీ గెలిచింది. వాస్తవానికి గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగం మొత్తం నాటి వైసీపీ సర్కార్‌కు అనుకూలంగానే పని చేసింది. చివరికి నామినేషన్ వేసేందుకు కూడా నేతలు భయపడిపోయారు. విత్ డ్రా చేసుకోవాలని కొన్నిచోట్ల పోలీసులే బెదిరించారు కూడా. అలాంటి పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించారు. ఓడిన తర్వాత… మా ఓటర్లు వేరేగా ఉన్నారంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాట అప్పట్లో వైరల్‌గా మారింది కూడా. ప్రస్తుతం కూడా పట్టభద్రులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. పోటీ చేస్తే… వైసీపీకి ఓటమి ఖాయం.. అప్పుడు ఈవీఎం గోల్‌మాల్ అనే మాట పూర్తిగా ఫేక్ ప్రచారం అని తేలిపోతుంది కూడా.




