వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న వైసిపి అధిష్టానం.. 2019 మాదిరిగానే సోషల్ మీడియా పై ఎక్కువగా దృష్టి సారించింది. ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సోషల్ మీడియాలో పక్క ప్రణాళిక ప్రకారం వైసిపి.. సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. 2019 కి ముందు పెద్ద ఎత్తున కార్యకర్తలతో సోషల్ మీడియాలో కొత్త ఎకౌంట్లు, పేజీలు, యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయించిన వైసీపీ ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమయింది. నియోజకవర్గాల వారీగా ఈ ప్రణాళికను అమలు చేయాలని పార్టీ అధిష్టానం నుంచి సూచనలు కూడా వెళ్లాయి.
Also Read : రష్యా – ఉక్రెయిన్ యుద్దంలో భారతీయలు.. కేంద్రం కీలక ప్రకటన
హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్స్ ను ఏర్పాటు చేసి వైసిపికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటర్వ్యూ లతో పాటుగా.. ప్రభుత్వ వ్యతిరేక వార్తలను పెద్ద ఎత్తున ప్రసారం చేసే విధంగా ప్లాన్ చేస్తోంది. వైసీపీలో ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులందరూ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయించి.. వాటి సమాచారాన్ని పార్టీ అధిష్టానానికి పంపాలని ఆదేశించినట్లుగా సమాచారం. ఇప్పటికే పలు చానల్స్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేయడం మొదలుపెట్టాయి.
Also Read : ఇదేం ప్రెస్ మీట్ అన్న..? షాక్ అవుతున్న జర్నలిస్ట్ లు
దీనికోసం పెద్ద ఎత్తున యాంకర్లను, వీడియో ఎడిటర్లను నియమించుకుంటున్నారు. వారికి సాక్షి ఛానల్ విలేకరుల నుంచి సమాచారం వెళ్లే విధంగా ప్లాన్ చేశారు. వైసీపీ అనుకూల మీడియా మొత్తం వీరితో కలిసి పని చేయనుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు.. మెయిన్ స్ట్రీo మీడియా కంటే కూడా ఆన్లైన్ మీడియానే ఎక్కువగా వైసీపీ నమ్ముకున్నట్లు సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తం జరుగుతున్నట్లు వైసిపి వర్గాలు అంటున్నాయి. వీటిని బెంగళూరు నుంచి వైసీపీ కి సంబంధించిన ఒక టీం మానిటర్ చేస్తున్నట్లు సమాచారం.