Saturday, September 13, 2025 07:10 AM
Saturday, September 13, 2025 07:10 AM
roots

అమరావతిపై మళ్ళీ వైసీపీ విష ప్రచారం..!

ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందుకు ప్రధాన కారణం మూడు రాజధానుల పేరుతో ఐదేళ్ల పాటు ఏపీకి రాజధాని ఏదో కూడా తెలియకుండా అందరినీ గందరగోళానికి గురి చేసింది. అదే సమయంలో ఏపీలో పెట్టుబడులు పెట్టించేందుకు వచ్చే కంపెనీల నుంచి వాటాలు డిమాండ్ చేశారనే ఆరోపణలు. అలాగే ఇప్పటికే కొనసాగుతున్న కంపెనీలపై వేధింపులు. దీంతో ఏపీ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Also Read : మరో మాజీ ఎమ్మెల్యేకి ఎర్త్ పెట్టిన బాబు సర్కార్

ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ఇదే అంశంపై ప్రజలకు భరోసా ఇచ్చారు. అందుకే కూటమికి అన్ని ప్రాంతాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అమరావతి పనులపై ప్రత్యేక పెట్టిన చంద్రబాబు.. 2027 జులై నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ చేశారు. సీఆర్డీఏ భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాలతో పాటు ఐకానిక్ టవర్లను కూడా పూర్తి చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. గతంలో ఐకానిక్ టవర్లకు నార్మన్ పోస్టర్ సంస్థ డిజైన్లు ఇచ్చింది. అయితే వీటిని జగన్ పక్కన పెట్టేశాడు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అదే సంస్థకు అవకాశం ఇచ్చారు.

Also Read : తెలంగాణాలో టీడీపీ జోష్

అమరావతి డిజైన్లపై వైసీపీ సోషల్ మీడియా మరోసారి విష ప్రచారం చేస్తోంది. గ్రాఫిక్స్ నగరం అంటూ వైసీపీ అనుకూల మీడియా ఫేక్ ప్రచారానికి తెర తీసింది. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తోందని.. డిజైన్లకే కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అంటూ సోషల్ మీడియాలో రోత పుట్టించేలా ప్రచారం చేస్తున్నారు. డిజైన్లకు కోట్లు చెల్లించి ఉంటే.. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్