Friday, September 12, 2025 05:09 PM
Friday, September 12, 2025 05:09 PM
roots

తిరుమలపై వైసీపీ భారీ కుట్ర..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం 70 వేల మంది పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక పండుగలు, వారంతం, సెలవు రోజుల్లో ఈ సంఖ్య లక్ష వరకు చేరుతుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో ఒక విధంగా బురద జల్లేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఐదేళ్ల పాటు తిరుమల గిరులపై వైసీపీ నేతల పెత్తనం కొనసాగింది. టికెట్ల అమ్మకం, గదుల కేటాయింపు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, అన్న ప్రసాద నాణ్యత.. ఇలా అన్ని అంశాల్లో కూడా తిరుమల ప్రతిష్ఠ దెబ్బ తీశారు వైసీపీ నేతలు. ఇక పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఇప్పటికే దాదాపు తేలిపోయింది. ఈ కేసు విచారణలో భాగంగా పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారు.

Also Read: ఎందుకు ఈ మౌనం.. సాక్షి తప్పుడు ప్రచారంపై సైలెంట్ గా కూటమి

ఆ తర్వాత వైసీపీ అనుకూల అధికారులు చేసిన కుట్రలో 8 మంది భక్తులు మృతి చెందారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు. దీనిపై కూడా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. ఇక ఆ తర్వాత గోశాలలో ఆవులు మృతి చెందుతున్నాయంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. ఇక దీనిపై చర్చకు రమ్మని టీడీపీ నేతలు సవాల్ కూడా విసిరారు. కానీ భూమన మాత్రం ముందుకు రాలేదు. ఆ తర్వాత తిరుమల కొండపై ఏ చిన్న విషయం జరిగినా సరే.. దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు.

Also Read : పోలీసులే జగన్ కు చుక్కలు చూపిస్తారా…?

తాజాగా ఇద్దరు పోలీసులు మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేశారు. వాస్తవానికి తిరుమల కొండపై మద్యం, మాంసం నిషేధం. అయితే పోలీసులు మాత్రం చెకింగ్ తప్పించుకుని కొండపైకి చేరుకున్న పోలీసులు.. మద్యం మత్తులో విజిలెన్స్ సిబ్బందికి చిక్కారు. వారిపై శాఖపరమైన చర్యలు తీసుకున్న అధికారులు.. సస్పెన్షన్ వేటు వేశారు. ఇక తిరుమలలో ఎలాంటి అక్రమాలకు చోటు లేదని తేల్చి చెప్పిన కూటమి ప్రభుత్వం.. టీటీడీ విజిలెన్స్ అధికారులతో కలిసి సిబ్బంది నివాసాల్లో సోదాలు చేపట్టింది. కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకే ఈ తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్ సిబ్బంది. ఈ సోదాల్లో కొంతమంది ఇంట్లో సిగరెట్లు, గుట్కాలు లభించాయి. దీంతో వారిని విధుల నుంచి తొలిగించడంతో పాటు తిరుమలలో కేటాయించిన క్వార్టర్స్‌ను కూడా ఖాళీ చేయించారు.

Also Read : కమలం గూటికి దువ్వాడ..? ఆ నేతతో చర్చలు మొదలు..?

తాజాగా క్యూ లైన్‌లో ఏర్పాట్లు బాగోలేవు అంటూ తప్పుడు ప్రచారం చేసేందుకు వైసీపీ నేతలు కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయారు. సాధారణంగానే శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక వేసవి సెలవులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. సర్వ దర్శనం భక్తులకు సుమారు 18 గంటలు పడుతుందని అధికారులు ముందే ప్రకటించారు. ఇక ఎస్ఎస్‌డీ టికెట్ దర్శనం కూడా 4 గంటలు పైగానే పడుతుంది. అయినా సరే వైసీపీ నేతలు మాత్రం భక్తులను గంటల తరబడి క్యూలైన్‌లో ఆపేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీఐపీల సేవలోనే టీటీడీ తరిస్తోంది అని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Also Read : జూన్ నెలలో పేలనున్న లిక్కర్ బాంబు..?

క్యూ లైన్‌లో భక్తులు ఇబ్బంది పడుతున్నారంటూ డౌన్ డౌన్ టీటీడీ ఛైర్మన్ అంటూ భక్తులు నినాదాలు చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇదేనా సనాతన ధర్మం అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. నినాదాలు చేసిన వ్యక్తి గుర్తించారు. అతని నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. నిజంగానే ఆలస్యమైందా.. లేక కావాలని చేశారా అని ప్రశ్నించారు. చివరికి ఆ భక్తుడు టీటీడీ అధికారులకు వివరణ ఇచ్చారు. బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడుకు క్షమాపణ చెప్పారు. నిరసన చేస్తే త్వరగా దర్శనానికి అనుమతిస్తారనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు వీడియో రిలీజ్ చేశారు. అలాగే క్యూలైన్‌లో తనకు సాంబార్ అన్నం, పాలు కూడా ఇచ్చారని వెల్లడించారు.

Also Read : మహానాడు తెచ్చిన మార్పులు..!

అయితే ఈ నినాదాలు చేసిన వ్యకి వైసీపీ నేతగా గుర్తించారు టీడీపీ శ్రేణులు. కాకినాడ రూరల్ నియోజకవర్గం తిమ్మాపురానికి చెందిన బద్దిలి అచ్చారావుగా గుర్తించారు. జగన్ తన ప్రియ శిష్యుడు అచ్చారావుకు వైసీపీ ప్రభుత్వంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ట్రస్టు ఛైర్మన్‌గా 2022లోనే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని టీడీపీ శ్రేణులు బయటపెట్టారు. తిరుమలపై జగన్ పగబట్టినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలాగైనా తిరుమల పేరు చెడగొట్టాలని తన మనుషులతో భారీ ప్రణాళిక రచించారని.. అందులో భాగంగానే, క్యూలైన్‌లో రాజకీయ స్లోగన్స్ చేశారంటున్నారు. తిరుమలలో క్యూ లైన్‌లో హడావిడి చేసిన వ్యక్తి జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు అని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని, జగన్ రెడ్డి ఫేక్ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల టీటీడీ అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

1 COMMENT

  1. జగన్ చెడ్డి గత ఐదు ఏళ్లలో క్యూ లైన్ లో ఏనాడు అయినా, పాలు ఇచ్చాడా. 2. అచ్చారావు ఎవరు, ఆయన background తొందరగానే బయటపడింది. అతను కరుడు కట్టిన ycp కార్యకర్త అని బయట పడింది. 3. పథకం ప్రకారం అతను క్యూ లో రెచ్చిపోవడం, అది వీడియో తీయటం, సోషల్ మీడియాలో వైరల్ చేయించటం అన్నీ చక చకా జరిగిపోయినాయి. 4. తను వైసీపీ మనిషి అని ఎక్కడ బయట పడుతుంది అని వేరే కథ ఎత్తుకున్నాడు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు వహించాలి. 5. పింక్ డైమండ్, కోడి కత్తి, గులకరాయి, బాబాయ్ హత్య etc ఎన్నో డ్రామాలు. ఇంకెన్ని వస్తాయో.

Comments are closed.

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్