కుటుంబ ఆస్తుల వివాదంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రోజు రోజుకు నిండా ముంచుతున్నారు సలహాదారులు. సొంత కుటుంబంలోని పరిస్థితుల్ని ఆయన డీల్ చేసుకోలేకపోతున్నారు. దీంతో సలహాదారులు జగన్ ను గందరగోళ పెట్టి పిచ్చి పనులు చేయిస్తున్నారు. ఆ పనులతో కుటుంబంలో మరింత అగాధం పెంచుతున్నారు. జగన్ రెడ్డి పరువును బజారున పడేస్తున్నారు.
తాజాగా వైఎస్ విజయలక్ష్మి రాసినట్లుగా ఓ లేఖను సృష్టించారు. అందులో ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేశారు. విజయలక్ష్మి కారుకు కర్నూలులో ప్రమాదం జరిగింది. అది ఎలా జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీనే. కోటి రూపాయల విలువైన ఓ లగ్జరీ కారు టైర్లు రెండు ఒకేసారి పేలడం అనేది అసాధ్యం. కంపెనీ కూడా అదే గ్యారంటీ ఇస్తుంది. మరి ఏదో చేయకపోతే ఎలా పేలాయి? అన్నది అందరికీ వచ్చే అనుమానం. ఈ విషయన్నే ఇప్పుడు టీడీపీ ప్రశ్నిస్తోంది. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మాదిరిగానే తల్లి విజయలక్ష్మిని కూడా హత్య చేసి… ఆ నెపం టీడీపీపై వేసేసి… ఆ సానుభూతితో ఓట్లు సాధించాలని జగన్ కుట్ర చేసినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read : తెలంగాణాలో రేవంత్ బీ టీం…?
దీనికి వైసీపీ కానీ, జగన్ కానీ అంత కంగారు ఆడాల్సిన పని లేదు… కానీ పడుతున్నారు. ఎందుకంటే ఆ కారు జగన్ మోహన్ రెడ్డి స్వయంగా తన తల్లి కోసం పంపించారు. అందులో సగం డబ్బులు షర్మిలతో కట్టించుకున్నారు. మిగిలిన సగం తన వాటాగా పార్టీలోని ఓ పారిశ్రామికవేత్తతో కట్టించారన్న గుసగుసలు ఉన్నాయి. ఆ కారు జగన్ పంపారు కాబట్టే కౌంటర్ ఇచ్చుకోలేని స్థితిలో వైసీపీ ఉంది. తల్లి పేరుతో ఖండిస్తే.. టీడీపీకి సరైన సమాధానం అనుకున్నారు. కానీ ఈ విషయంలో ఇన్వాల్వ్ కావడానికి ఆమె రెడీ కాలేదు. అందుకే అడ్వాంటేజ్ తీసుకుని సంతకాన్ని ఫోర్జరీ చేసేశారు.
Also Read : బాబు గారు… సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడిస్తారు..?
ఆ సంతకాన్ని రేపు మరో విధంగా ఫోర్జరీ చేయరన్న గ్యారంటీ లేకపోవడంతో తీవ్రమైన హెచ్చరికలే వచ్చినట్లుగా ఉన్నాయి. వెంటనే డిలీట్ చేశారు. దీంతో ఉన్న పరువు.. అమ్మ దగ్గర ఏమైనా సానుభూతి ఉంటే అదీ కూడా పోయింది. ఈ సలహా జగన్‌దా.. సజ్జలదా అని ఇప్పుడు వైసీపీ నేతలు మరోసారి చర్చించుకుంటున్నారు.




