Tuesday, October 28, 2025 06:58 AM
Tuesday, October 28, 2025 06:58 AM
roots

సోషల్ మీడియాలో వైసీపీ భారీ పెట్టుబడులు.. అక్కడే స్టూడియోలు

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కష్టపడుతున్న వైసిపి నాయకులు.. సోషల్ మీడియాను గట్టిగా వాడుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2014 తర్వాత సోషల్ మీడియా విషయంలో వైసీపీ నేతల దూకుడు అప్పట్లో టిడిపిని బాగా ఇబ్బంది పెట్టింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వైసీపీ ఎమ్మెల్యేలు వెనకబడ్డారు. వైసీపీ సోషల్ మీడియా ప్రజా ప్రతినిధుల ఖాతాలను కూడా.. వైసీపీ అధిష్టానమే మెయింటైన్ చేయటంతో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడ్డారు.

Also Read : మహా న్యూస్ పై దాడి వెనుక వైసీపీ హస్తం..?

తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో చెప్పేందుకు కూడా కష్ట పడ్డారు. అయితే పార్టీ కోసం కష్టపడి, ఆర్థికంగా నష్టపోయి, ఇతర పార్టీలలోకి వెళ్లడానికి అవకాశం లేని నాయకులు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు సోషల్ మీడియాను బలంగా వాడుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో.. ఒకరిద్దరు మాజీ ఎంపీలు మీడియా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా యూట్యూబ్ ఛానల్ తో పాటుగా, సోషల్ మీడియా ఖాతాలపై కూడా భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also Read : ఆహా.. సంస్కారవంతమైన భాష..!

యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించే కొందరు యువకులతో ఇటీవల ఇద్దరు మాజీ ఎంపీలు బేటి అయ్యారు. వాళ్లకు ఆర్థికంగా సహకారం అందించేందుకు కూడా సిద్ధమయ్యారు. మీడియా రంగంలో అనుభవం ఉన్న వాళ్ళతో యూట్యూబ్ ఛానల్స్ ను.. ఓపెన్ చేయించి ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి సహకరించిన కొంతమంది జర్నలిస్టులతో ఇప్పటికే యూట్యూబ్ చానల్స్ ఓపెన్ చేయించారు. హైదరాబాదులోని తమ సన్నిహితుల ఇళ్లలోనే కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయించారు. పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా తమకు పాజిటివ్ వాతావరణం సృష్టించేందుకు ఆ ఇద్దరు మాజీ ఎంపీలు తీవ్రంగా కష్టపడుతున్నారు. వీరికి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల నుంచి కూడా సహకారం ఉందట. జూబ్లీహిల్స్, మాదాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో యూట్యూబ్ ఛానల్స్ ను నిర్వహించేందుకు ఆర్థికంగా.. ఆయ వ్యక్తులకు ఇప్పటికే భారీగా నగదు కూడా అందించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్