ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బాహుబలి, పుష్ప సీరీస్ లు కంప్లీట్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి ఎన్నికయ్యాడు… లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్ళారు. అరవింద్ కేజ్రివాల్ మానిష్ సిసోడియా వెళ్లి వచ్చారు. దశాబ్దాలుగా కాశ్మీర్ లో జరిగే రాళ్ళ దాడులు ఆగిపోయాయి… రామ మందిర నిర్మాణం పూర్తి అయింది. ఆర్టికల్ 360 వంటివి రద్దు అయ్యాయి… రేపో మాపో శ్రీలంక, భారత్ మధ్యన వంతెన నిర్మాణం కూడా మొదలు అవుతుంది. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి కేసు మాత్రం పరిష్కారం కాలేదు.
Also Read : ఏపీ ముఖచిత్రం మార్చేసిన 2024…!
చంపింది ఎవరు,చంపించిన వాళ్ళు ఎవరు, కాపాడే వాళ్ళు ఎవరు అనే విషయాలు అన్నీ క్లారిటీ ఉన్నాయి. సాక్ష్యాలు, రిపోర్ట్ లు ఇలా ప్రతీ ఒక్కటి ఉన్నాయి. కాని కేసు మాత్రం ఆ పులివెందుల గెస్ట్ హౌస్ దాటి మాత్రం వెళ్ళదు. ఆ విచారణ ఎక్కడ వరకు వచ్చిందో… దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డి, యెర్ర గంగిరెడ్డి బ్యాచ్ ఏం చేస్తుందో… ఎప్పటికీ క్లారిటీ రాదూ… ఉండదు. ఇప్పుడు మళ్ళీ విచారణ మొదలయింది అనే ఓ న్యూస్ వచ్చింది. దానికి సోషల్ మీడియాలో టీడీపీ హడావుడి కామన్ అయింది.
వైయస్ వివేకా హత్య కేసులో విచారణకు డుమ్మా కొట్టిన ఎంపీ అవినాష్ రెడ్డి,ఆయన బందుగణం అనే ఓ న్యూస్ టీడీపీ అనుకూల మీడియాలో వస్తోంది. వివేకా హత్య కేసులో విచారణకు రావాలంటూ నిన్న నోటీసులు ఇచ్చిన పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ కు షాక్ ఇచ్చారట అవినాష్ రెడ్డి అండ్ గ్యాంగ్. వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డి, వైయస్ అభిషేక్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, ఓబుల్ రెడ్డి లకు ఇప్పటికే నోటీసులు పంపారు.
Also Read : మరి ఇలా అయితే ఎలా సజ్జల గారు…!
ఐదుగురు తో మరో ఐదుగురు సాక్షులకు పులివెందుల డిఎస్పీ మురళీ నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు రావాలంటూ ఆదేశాలు ఇచ్చినా ఎవరూ హాజరు కాలేదు. నేడు పులివెందుల డిఎస్పీ అందుబాటులో లేరు అనే కారణంతో విచారణ డుమ్మా కోట్టారట. కాని వారు ఎవరూ పులివెందులలో కనపడలేదు. విచారణకు వస్తారా పారిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.