Saturday, September 13, 2025 01:13 AM
Saturday, September 13, 2025 01:13 AM
roots

ప్రభాస్ తో అనుబంధం పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

సినీ హీరో ప్రభాస్ కు తనకు మధ్య రిలేషన్ ఉందని… దానిపై నందమూరి బాలకృష్ణ ఇంట్లో కూర్చుని ప్రచారం చేయించారు అంటూ… వైఎస్ జగన్ తనపై చేసిన కామెంట్స్ కు షర్మిల ఘాటు రిప్లై ఇచ్చారు. నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక్క ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించాలని… మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎం గా ఉన్నారు అప్పుడు గాడిదలు కాసారా? అని నిలదీశారు. ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? అంటూ జగన్ ను షర్మిల ప్రశ్నించారు.

Also Read : ఇక సెలవ్.. పోసాని సంచలన నిర్ణయం

ప్రభాస్ కు నాకు సంబంధం ఉందని వచ్చిన ప్రచారం మీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా? అని ఆమె నిలదీశారు. మా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదన్న ఆమె… జగన్ ఈ ప్రాప గండా అయన పార్టీ నేతలతో చేయించారని మండిపడ్డారు. నా వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మ పై కేసు పెడతారు …నాన్న పేరు సీబీఐ చార్జి షీట్ లో పెడతారు చెల్లి పై దుష్ప్రచారం చేయిస్తారని విమర్శించారు.

Also Read : టీటీడీ ప్రక్షాళన నిజంగా సాధ్యమేనా..?

జగన్ మోడీ కి దత్త పుత్రుడు… ఆయన మీద ఎంక్వైరీ వేస్తారా? అంటూ నిలదీశారు. పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా ప్రభాస్ ఎవరో తనకు తెలియదు, డైరెక్ట్ గా కలవలేదు అని షర్మిల స్పష్టం చేసారు. జగన్‌ ఏపీ పరువు తీశారు అని ఆమె ఆరోపించారు. ఏపీ మాజీ సీఎం జగన్‌కు పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందన్న ఆమె… ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్‌ రాష్ట్రం పరువు తీశారని మండిపడ్డారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్