ఏపీలో వైఎస్ జగన్ కు టీడీపీతో, జనసేనతో ఎంత ఇబ్బంది ఉందో క్లారిటీ లేదు గాని జరుగుతున్నవి చూస్తుంటే షర్మిలతో మాత్రం ఆయనకు ఖచ్చితంగా ఫ్యూచర్ భయంకరంగా ఉండే సంకేతాలు క్లియర్ గా కనపడుతున్నాయి. షర్మిలను తక్కువ అంచనా వేసిన జగన్… ఆమెను నానా తిట్లు తిట్టించారు. ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకరకంగా జగన్ కంటే షర్మిలకు అనుకూల పవనాలు ఎక్కువగా వీస్తున్నాయి. షర్మిల ప్రజా పోరాటాలు ఎక్కువగానే చేస్తున్నారు.
Also Read : జేసి ఫ్యామిలీని పోలీసులు ఇంకా వేధిస్తున్నారా…?
ప్రతీ అంశం మీద ఆమె పోరాటం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్య, ఆరోగ్య శాఖ, విద్యా శాఖా, గనులు, అటవీ శాఖా, అదాని అవినీతి వ్యవహారం ఇలా పలు కీలక అంశాలపై షర్మిల పోరాటాలు చేస్తున్నారు. వైసీపీ ఏ విషయాలను అయితే సైలెంట్ గా పక్కన పెట్టిందో… పోరాటాలు చేయకుండా మౌనంగా ఉంటుందో ఆయా అంశాలను షర్మిల సీరియస్ గా ఫోకస్ చేసారు. వాటిపైనే ఆమె ఉద్యమాలు కూడా చేస్తున్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం ఆమె నిలబడి సక్సెస్ అయ్యారు. అలాగే వరద బాధితుల కోసం కూడా షర్మిల పోరాటం చేసారు.
Also Read : ఏపీ రాజ్యసభ అభ్యర్ధులు ఫైనల్ అయినట్లే…?
ఇక అదానితో జరిగిన గత ప్రభుత్వ ఒప్పందాలపై ఆమె సీరియస్ గానే ఉన్నారు. సిఎం చంద్రబాబుకు ఓ లేఖ కూడా రాసారు షర్మిల. అలాగే గవర్నర్ ను కలిసి విచారణ చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేసారు. కర్ణాటక సిఎంపై విచారణ చేసినప్పుడు జగన్ పై ఎందుకు విచారణ చేయడం లేదని ఆమె డిమాండ్ కూడా చేసారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీపై కూడా విమర్శలు చేస్తున్నారు షర్మిల. ఇప్పుడు అదాని వ్యవహారంలో అవసరమైతే సుప్రీం కోర్ట్ వరకు అయినా వెళ్లేందుకు షర్మిల సిద్దంగా ఉన్నాను అని ప్రకటన చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

