Friday, September 12, 2025 05:22 PM
Friday, September 12, 2025 05:22 PM
roots

విసారెడ్డి రాజీనామా పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైసీపీకి విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంపై.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. విజయసాయి రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడని.. జగన్ ఏ పని ఆదేశిస్తే…ఆ పని చేయడం.. ఎవరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం సాయి రెడ్డి పని, రాజకీయంగా కాదు.. వ్యక్తిగతంగా కూడా.. నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయి రెడ్డి అంటూ మండిపడ్డ ఆమె.. ఈ అబద్ధాలు జగన్ చెప్తే సాయి రెడ్డి చెప్పాడని ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశాడు అంటే చిన్న విషయం కాదన్నారు.

Also Read : వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రైతుబంధు దందా

వైసిపి కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయండని కోరిన షర్మిల.. జగన్ ను విజయసాయి రెడ్డి వదిలేశారు అంటే ఎందుకు ? సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారు ? ప్రాణం పెట్టిన వాళ్ళు ఎందుకు జగన్ ను వీడుతున్నారు ? అంటూ ప్రశ్నించిన ఆమె.. జగన్ నాయకుడుగా విశ్వసనీయత కోల్పోయారని నాయకుడుగా ప్రజలను, నమ్ముకున్న వాళ్ళను మోసం చేశారని మండిపడ్డారు. నా అనుకున్న వాళ్ళను కాపాడుకోలేక పోతున్నాడని ఆరోపించారు. జగన్ బీజేపీ కి దత్త పుత్రుడన్ని తనను తాను కాపాడుకోవడానికి సాయి రెడ్డిని బీజేపీకి పంపాడని ఆమె విమర్శించారు.

Also Read : అవినాష్ రెడ్డి ని అడ్డంగా బుక్ చేసిన విసారెడ్డి

ఇన్నాళ్లు సాయి రెడ్డి నీ పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే సాయి రెడ్డి వెళ్ళిపోయాడని షర్మిల కామెంట్ చేసారు. సాయి రెడ్డి బయటకు వచ్చాడు.. నిజాలు చెప్పాలని డిమాండ్ చేసారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అని మీకు తెలుసన్నారు. వివేకా హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషమన్నారు. మిగతా విషయాలు కూడా బయట పెట్టండని ఆమె డిమాండ్ చేసారు. సాయి రెడ్డి వివేక హత్య పై ఇన్నాళ్ళకయినా నిజం చెప్పారు.. అవినాష్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిని కాపాడటం కోసం సాయి రెడ్డి ఎన్నో చేశాడన్నారు. ఇంకా చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి అవి కూడా సాయి రెడ్డి బయటకు వచ్చి చెప్పాలని కోరారు షర్మిల.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్