వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మరిన్ని సంచలన విషయాలను ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బయటపెట్టారు. తన పిల్లలకు చెందిన ఆస్తిని కూడా జగన్ మోహన్ రెడ్డి కాజేసేందుకు యత్నించాడని షర్మిల ఆరోపించారు. ఈ విషయాలన్నీ కూడా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా తనతో చెప్పాడన్నారు షర్మిల. ఇంకా చాలా విషయాలు చెప్పాడన్న షర్మిల… తను మాత్రం కేవలం తనకు, తన పిల్లలకు సంబంధించిన విషయాలు మాత్రమే చెబుతున్నట్లు షర్మిల వ్యాఖ్యానించారు. సొంత మేనకోడలు, మేనల్లుడి ఆస్తులు కూడా కాజేయాలని జగన్ కుట్రలు చేశారంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read:ఎమ్మెల్యే గారి వైసీపీ ప్రేమ.. కృష్ణా జిల్లాలో అలజడి..!
వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇటీవల హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలతో సుమారు 3 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలను సాయిరెడ్డి వెల్లడించినట్లు షర్మిల స్వయంగా తెలిపారు. జగన్ వల్ల విజయసాయిరెడ్డి ఎన్నో ఇబ్బందులు పడ్డారని… ఆ విషయాలన్ని స్వయంగా సాయిరెడ్డి తనతో చెప్పాడన్నారు. అయితే వాటిని బయటపెట్టడం లేదన్నారు షర్మిల. ఆస్తికి సంబంధించి జగన్ చేసిన అక్రమాలను షర్మిల వివరించారు. షేర్స్ మొత్తం తనకే చెందాలంటూ తన మీద, తల్లి విజయలక్ష్మి మీద కేసు వేశారని… అందుకే వైఎస్ఆర్ గతంలో చెప్పిన మాటలు చెప్పానన్నారు. దాంతో విజయ సాయిరెడ్డితో జగనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టించి నా మాటలు అబద్ధాలు అని చెప్పించారన్నారు షర్మిల.
Also Read: షర్మిలను దెబ్బ కొట్టడమే లక్ష్యమా…?
ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు అబద్ధమని తన తల్లి విజయలక్ష్మి లేఖ రాసినట్లు షర్మిల వెల్లడించారు. తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా జగన్ దిగజారిపోయారని…. క్యారెక్టర్ మీద కూడా నీచంగా మాట్లాడించారని కన్నీరు పెట్టుకున్నారు. పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన జగన్… క్యారెక్టర్ అంటే ఏంటో పూర్తిగా మర్చిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తీసుకొచ్చారని షర్మిల ఆరోపించారు. పరువు పోతుంది… వదిలేయండి అని సాయిరెడ్డి సూచించినప్పటికీ… జగన్ ఊరుకోలేదని విమర్శించారు. ఏ అబద్ధాలు ఎలా చెప్పాలో.. జగన్ చెబితే… సాయిరెడ్డి రాసుకున్నారని… ఇది జగన్ మహోన్నత క్యారెక్టర్ అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.




