Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

జగన్ ను కాపాడేది నువ్వే.. అమిత్ షా పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర కామెంట్స్ చేసారు. అమిత్ షా గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పాలన ఓ విపత్తు అయితే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా ? ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా ? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా ? రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read : ఏపిలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు

ఇష్టారాజ్యంగా రూ.10లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా ? సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోం శాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు ? భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా ? అంటూ నిలదీశారు. 5 ఏళ్లపాటు జగన్ గారు మీకు దత్తపుత్రుడు. ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ… పార్లమెంట్‌లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్. రాష్ట్రంలో సహజ వనరులను ‘మోదానీ’కి దోచిపెట్టే ఏజెంట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు షర్మిల.

Also Read : వైసీపీ నేతలకు షెల్టర్ జోన్ గా బిజేపి, జనసేన

మీ ఇష్టారాజ్యంగా 5 ఏళ్లు వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారు అంటూ విమర్శించారు షర్మిల. 2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ గారు అయితే… కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమేనన్న షర్మిల… 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటాం… రూ.3లక్షల కోట్లు ఇస్తాం, పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనమని ఎద్దేవా చేసారు. అమిత్ షా గారిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. మీ వ్యాఖ్యలు మీద మీరు కట్టుబడి ఉంటే.. మీకు దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించండి అంటూ సవాల్ చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్