నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్యకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సర్‌ప్రైజ్ ఇచ్చారు. బుధవారం అలేఖ్య బర్త్ డే కాగా.. షర్మిల తన కుమార్తె అంజలితో కలిసి అలేఖ్య ఇంటికి వెళ్లి సెలబ్రేట్ చేశారు. షర్మిల అంజలితో కలిసి అలేఖ్య ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు చెప్పగా.. ఆ సమయంలో అలేఖ్య ఎమోషనల్ అయ్యారు. షర్మిల ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఆ తర్వాత అలేఖ్య ఇద్దరికి కేక్ తినిపించారు. ఈ వీడియోను అలేఖ్య తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయగా.. ఇప్పుడు వైరల్ అవుతోంది.
అలేఖ్య షర్మిలతో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న వీడియోను షేర్ చేసి.. ‘గత రెండేళ్లుగా మాకు అండగా ఉంటానన్న మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది.. నా పుట్టిన రోజు జరుపుకోవడానికి సమయం కేటాయిస్తూ.. మీరు నా జీవితంలో ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఎంత ప్రత్యేకమో చెప్పడానికి పదాలు కూడా తెలియడం లేదు. లవ్ యూ సోమచ్ అక్కా.. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే’ అంటూ అలేఖ్య షర్మిల గురించి రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అలేఖ్యకు షర్మిల ఎంతో భరోసాను ఇస్తున్నారని ప్రశంసిస్తున్నారు.
నందమూరి తారకరత్న టీడీపీలో యాక్టివ్‌గా ఉన్న సమయంలో 2023 జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన రోజు తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. వెంటనే మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే.. 2023 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. భర్తను కోల్పోయిన అలేఖ్యకు నందమూరి, నారా కుటుంబాలు అండగా నిలిచాయి. ఇటు వైఎస్ షర్మిలకు కూడా అలేఖ్యతో పరిచయాలు ఉన్నాయి. షర్మిల తన కుమారుడి వివాహానికి అలేఖ్యను ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు. ఇప్పుడు అలేఖ్య బర్త్ డేను సెలబ్రేట్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు వైఎస్ షర్మిల.