Saturday, September 13, 2025 05:23 AM
Saturday, September 13, 2025 05:23 AM
roots

సొంత అన్నకు ఏకు మేకై కూర్చున్న చెల్లెలు

ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వలేదనో, నీ కోసం కాళ్ళకు బలపం కట్టుకుని తిరిగి నీ పార్టీని బ్రతికిస్తే కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదనే ఆవేదనో, ఆస్తుల తగాదాలో, వదిన మీద పీకల వరకు ఉన్న కోపమో, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావ్ కనీసం నన్ను ప్రజా ప్రతినిధి కూడా కానీయకుండా అడ్డుకున్నావ్ అనే కడుపు మంటో తెలియదు గాని ఇప్పుడు షర్మిల చేస్తున్న రాజకీయం చూస్తుంటే మాత్రం ‘షీ ఈజ్ థింకింగ్ బిగ్’ అనే ఆలోచన వస్తోంది ప్రజలకు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన షర్మిల
బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సైలెంట్ గా లేరు. అవకాశం వచ్చిన ప్రతిసారీ జగన్ పై విరుచుకుపడ్డారు.

వరద బాధిత ప్రాంతాలకు జగన్ కంటే ఒక రోజు ముందే వెళ్ళడం, ఏదైనా అంశంలో వెంటనే విమర్శలు చేయడం, అవి ప్రజల్లోకి వెళ్ళే విధంగా మాట్లాడటం షర్మిల చేస్తున్నారు. విజయవాడ వరదలు అయినా, తూర్పు గోదావరి జిల్లా వరదలు అయినా సరే జగన్ కంటే ముందే వెళ్ళారు షర్మిల. లడ్డూ వ్యవహారంలో కూడా షర్మిల వేగంగానే స్పందించారు. ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో ఒక్క ఎమ్మెల్యే కూడా తన చేతిలో లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. ప్రతి ప్రభుత్వ నిర్ణయం పై తన అభిప్రియ తెలియచేస్తూ తనకంటూ ఒక స్థానం తెచ్చుకున్నారు.

Read Also : ఎన్టీఆర్ కు వింత అనుభవం.. ఆందోళనలో యూనిట్

వైసీపీకి జనాల్లో ఆదరణ లేదనుకున్నారో ఏమో తెలియదు గాని… ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు షర్మిల. దీనితో ఇప్పుడు జగన్ కు షర్మిల తలనొప్పిగా మారారు. రాజకీయంగా నానా అవస్థలు పడుతున్న జగన్ కు.. షర్మిల రాజకీయం తలనొప్పిగా మారింది. అటు కాంగ్రెస్ కు కూడా జగన్ ను దగ్గర కానీయడం లేదు షర్మిల. దీనితో జగన్ అనుకున్నవి జరగడం లేదు. మరి భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి ఏంటీ అనేది తెలియదు గాని… రాజీ మార్గాలను కూడా షర్మిల వెతకకుండా రాజకీయం చేయడం జగన్ రాజకీయ భవిష్యత్తుకు సమస్యే. ఇది ఇలానే కొనసాగితే వైసీపీ క్యాడర్ మొత్తం జగన్ వ్యవహారశైలి పై నమ్మకం కోల్పోయి షర్మిల వద్దకు చేరితే జగన్ రాజకీయంగా కనుమరుగు కావడానికి ఎక్కువ రోజులు పట్టదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్