“తనది కాకపోతే.. కాశీ వరకు పాక్కుంటూ వెళ్లమన్నాడట..” అనేది సామెత. ఈ మాట వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేకపోతే మరోలా ఉండటం ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే చెల్లింది. అదే సమయంలో తాము చేస్తే సంసారం.. ఎదుటి వాళ్లు చేస్తే… అన్నట్లుగా కూడా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారనే విషయం మర్చిపోయినట్లున్నారు. ఓడిపోగానే నీతి సూత్రాలు చెబుతున్నారు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏ చిన్న పని చేసినా సరే… అందులో రంధ్రాన్వేషణ చేస్తున్నారు. అయితే గతంలో మీరు చేసింది ఏమిటీ అంటే మాత్రం… తేలు కుట్టిన దొంగల మాదిరిగా సైలెంట్‌గా పలాయనం చిత్తగిస్తున్నారు.
Also Read : వర్మ కోసం వైసీపీ మైండ్ గేమ్..!
తెలుగు వారంతా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించింది. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పంచాంగ శ్రవణం కూడా నిర్వహించారు. ఆ తర్వాత పలు రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పురస్కారాలు అందించారు. అలాగే రైతులను కూడా ఉగాది పురస్కారాలతో చంద్రబాబు సత్కరించారు. వీటినే ఇప్పుడు వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు.
Also Read : మరో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్
చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న వారంతా ఎవరూ అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కూడా కులం రంగు పులుముతున్నారు. ఎక్కువగా ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే విజయవాడ కమిషనరేట్ సమీపంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహించడం వల్ల విజయవాడ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు ఘాటుగానే బదులిస్తున్నారు. గతేడాది ఉగాది పండుగ సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ వెనుక ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక గుడి సెట్ వేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న జగన్‌ను.. సినిమా పాటలతో తెగ పొగిడేశారు వైసీపీ అభిమానులు. అలాగే అసలు రైతులే కాని వారికి కూడా గతేడాది పురస్కారాల పేరుతో భారీగా నజరానాలు అందించింది వైసీపీ సర్కార్. వీటిని ప్రస్తావిస్తున్న కూటమి నేతలు.. మీలా.. ప్రభుత్వ సొమ్ముతో సెట్ వేయలేదని బాధపడుతున్నారా అని ఎద్దేవా చేస్తున్నారు. అలాగే సీఎం అయితేనే జగన్ ఉగాది పండుగ జరుపుకుంటారా… మాజీ అయితే.. ఉగాదికి దూరంగా ఉంటారా అని నిలదీస్తున్నారు.
Also Read : ఇది తెలుసా: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న రూల్స్ ఇవే
సీఎంగా ఉన్నా.. లేకున్నా కూడా.. చంద్రబాబు ప్రతి ఏడాది పార్టీ కార్యాలయంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారని… మరి జగన్ ఈ ఏడాది ఏమయ్యాడని నిలదీస్తున్నారు. జగన్ తెలుగోడు కాదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రతి తెలుగు వారు కూడా ఉగాది పండుగ జరుపుకుంటారని… జగన్ మాత్రం ఎందుకు జరుపుకోవటం లేదంటున్నారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పిన జగన్… ఉగాది పచ్చడి ఎందుకు తీసుకోలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము అయితే… సెట్ వేస్తారు… అదే సొంత సొమ్ము అయితే మాత్రం.. మనకెందుకు లే అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు.